ANNAMYYA SANKEERTANS’ ENTRALLS ART LOVERS _ తన్మయత్వంలో ముంచెత్తిన ‘అన్నమయ్య సంకీర్త‌న‌లు’

Tirupati, 28 May 2024: As part of the 616th birth anniversary celebrations of Sri Tallapaka Annamacharya, the denizens of the temple city were mesmerized by the Sankeertans sung by renowned musician Srimati Pantula Rama from Visakhapatnam at Annamacharya Kalamandiram in Tirupati on Tuesday evening.

In this devotional musical fiesta the popular vocalist rendered some memorable Sankeertans pf Annamacharya and Tyagaraja including “Rāma candruḍitaḍu..

Eduṭa nunnāḍu vīḍē…

Endarō mahānubhāvānulu 

veṅkaṭēśa ninu sēvimpa 

gōvardhanagiri dharā, her own music composition in Mandu Ragam..Govindahari Govinda.. A folklore penned by Annamacharya in a soul-touching manner. 

On Violin Sri MSN Murty and Mridangam Sri Kotipalle Ramesh exhibited their impeccable skills much to the applause of the audience.

The Annamacharya Project Director Dr. Vibhishana Sharma, TTD officials and a large number of music lovers participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తన్మయత్వంలో ముంచెత్తిన ‘అన్నమయ్య సంకీర్త‌న‌లు’

తిరుపతి, 2024 మే 28: శ్రీ అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మంగ‌ళ‌వారం సాయంత్రం విశాఖపట్నంకు చెందిన శ్రీ‌మ‌తి పంతుల ర‌మ బృందం ఆల‌పించిన సంకీర్త‌న‌ల‌తో పుర ప్ర‌జ‌లు తన్మయత్వం చెందారు.

ఇందులో భాగంగా ” రామ చంద్రుడితడు…,
ఎదుట నున్నాడు వీడే…,
ఎందరో మహానుభావానులు…,
వెంకటేశ నిను సేవింప…..,
గోవర్ధనగిరి ధరా…., సొంతంగా స్వరపరిచిన గోవిందా హరి గోవిందా…..” త‌దిత‌ర‌
కీర్తనలను సుమధురంగా ఆలపించారు.

వయోలిన్‌పై శ్రీ ఎమ్‌ఎస్‌ఎన్‌ మూర్తి, మృదంగం మీద శ్రీ కోటిపల్లి రమేశ్ లు తమ అద్భుతమైన కళా నైపుణ్యం ప్రదర్శించి, ప్రేక్షకులను విశేషంగా అలరించారు.

ఆనంత‌రం అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌ డా. విభీషణ శర్మ క‌ళాకారుల‌ను శాలువ, శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాల‌తో స‌త్క‌రించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.