ANNIVERSARY CELEBRATIONS AT SRI VENKATESWARA GO SAMRAKSHANASHALA ON JAN 16_ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16న వార్షిక కనుమ వేడుకలు

Tirupati, 23 December 2017: The Kanuma event on the third day of holy Makara Sankranthi will be celebrated at SV Gosamrakshana Shala on January 16.

Prayers and worship of Cows regarded as Go Matha by Hindus is a sacred ritual aimed spreading prosperity and well being of the commonunity.

The ritual includes Venu Ganjam, Veda Parayanam. Bhajanas and Kolatas . Go puja is also performed in Sri Venugopala Swamy Temple. After cultural events, Darshan and Prasadam is also provided.

The TTD also gave option of feeding jaggery, rice and grass to devotees at the Go Samrakshana Shala.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16న వార్షిక కనుమ వేడుకలు

డిసెంబరు 23, తిరుపతి, 2017: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో జనవరి 16వ తేదీ మంగళవారం వార్షిక కనుమ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. మకర సంక్రాంతి పర్వదినం మూడో రోజు కనుమ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉంది. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారు. కనుమ పండుగ రోజు పశువులను అలంకరించి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా చేయడం వల్ల పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందని నమ్మకం. కనుమ పండుగ సందర్భంగా ఎస్వీ గోసంరక్షణశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం వేణుగానం, వేదపారాయణం, భజనలు, కోలాటాలు నిర్వహిస్తారు. శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ చేస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీ వేణుగోపాలస్వామివారి దర్శనం, ప్రసాదం పంపిణీ చేస్తారు.

గోమహోత్సవం రోజున పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఈ సదవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గోమాత, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.