ANNUAL BRAHMOTSAVAMS AT CHANDRAGIRI KODANDARAMALAYAM _ ఏప్రిల్ 21 నుండి మే 1వ తేదీ వ‌ర‌కు చంద్రగిరి శ్రీ కోదండరామాలయ వార్షిక‌ బ్రహ్మోత్సవాలు

Tirupati, 15 April 2021: TTD Is organising the annual Brahmotsavams of Sri Kodandaramaswami temple at Chandragiri from April 21 to May 1 in Ekantham in view of Covid guidelines.

As part of Sri Rama Navami celebrations, special abhisekam is performed for both Mula Virat and also to the utsava idols on April 21 and also Ankurarpanam for the Brahmotsavam.

Follow are prominent events of the Brahmotsavam:

Dhwajavarohanam will be performed on April 22 between 11.30am and 12.15pm. While on April 25, Tiruchi utsavam instead of Hanumanta vahana will be performed and Sri Sitarama Kalyanotsavam on April 27 and Tiruchi at night instead of Garuda vahanam.

Vasantothsavam Snapana thirumanjanam, chakra snanam and Dwajavarohanam will be performed on April 30. Finally, Sri Rama Pattabhisekam will be observed on May 1 evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 21 నుండి మే 1వ తేదీ వ‌ర‌కు చంద్రగిరి శ్రీ కోదండరామాలయ వార్షిక‌ బ్రహ్మోత్సవాలు

తిరుప‌తి, 2021 ఏప్రిల్ 15: టిటిడికి అనుబంధంగా ఉన్న చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆల‌య వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 21 నుండి మే 1వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్నాయి. కోవిడ్‌-19 నేప‌థ్యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఏప్రిల్ 21న శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఉదయం 5 నుండి 6 గంటల వరకు మూలవర్లకు అభిషేకం, ఉదయం 6.30 నుండి 7.30 గంటల వరకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వ‌హిస్తారు. అదేరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్ప‌ణ చేప‌డ‌తారు.

ఏప్రిల్ 22న ఉద‌యం 11.30 నుండి 12.15 గంట‌ల మ‌ధ్య ధ్వ‌జారోహ‌ణం నిర్వ‌హిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 5 నుండి 5.30 గంటల వరకు ఘంటానాదం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు హోమం నిర్వహిస్తారు. ఏప్రిల్ 25న సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారికి హనుమంత వాహన సేవ బ‌దులు తిరుచ్చి ఉత్స‌వ ఆస్థానం చేప‌డ‌తారు.

ఏప్రిల్ 27న ఉద‌యం 10 నుండి 11.30 గంటల వరకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు గరుడ వాహనం బ‌దులు తిరుచ్చి ఉత్స‌వ ఆస్థానం నిర్వ‌హిస్తారు. ఏప్రిల్ 30న ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వసంతోత్సవం, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చక్రస్నానం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మే 1వ తేదీ సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీ రామపట్టాభిషేకం నిర్వ‌హిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.