ANNUAL BTU OF SRI KARRI MANIKYASWAMY TEMPLE, TUMMURU FROM MAY 27- JUNE 5_ మే 27 నుండి జూన్‌ 5వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 13 May 2018: The plans to perform the Annual Brahmotsavam of Sri Karri Manikyaswami Temple, Tummur village of Naidu pet mandal, Nellore district from May 27 to June 5 in a grand way. As part of the event Koil Alwar Tirumanjanam ritual will be held on May 22 and Ankurarpanam on May 26.

All the salient utsavam and sevas of the Brahmotsavam will begin with Dwajarohanam, Vahana sevas will be performed from May 27 to June 5, particularly Parveta utsavam on June 3 and Pushpa Yagam on June 5.

During Brahmotsavam very day there will be Vahana sevas in morning and evening. There will be Kalyanotsavam on June 1. The artists of HDPP, Annamachary Project, and Dasa Sahitya Project will perform devotional, Bhakti sangeet, cultural programs and Harikathas during the Brahmotsavam to enthrall the devotees.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మే 27 నుండి జూన్‌ 5వ తేదీ వరకు తుమ్మూరులోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 13, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరు గ్రామంలోని శ్రీ కరిమాణిక్యస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 27 నుండి జూన్‌ 5వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 22న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 26న అంకురార్పణం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

27-05-18(ఆదివారం) ధ్వజారోహణం శేష వాహనం

28-05-18(సోమవారం) తిరుచ్చి ఉత్సవం హనుమంత వాహనం

29-05-18(మంగళవారం) ద్వార దర్శనం గరుడసేవ

30-05-18(బుధవారం) తిరుచ్చి ఉత్సవం హంస వాహనం

31-05-18(గురువారం) తిరుచ్చి ఉత్సవం విమాన వాహనం

01-06-18(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం సింహవాహనం, గజవాహనం, స్వామివారి కల్యాణం.

02-06-18(శనివారం) రథోత్సవం తిరుచ్చి ఉత్సవం

03-06-18(ఆదివారం) తిరుచ్చి ఉత్సవం పార్వేట ఉత్సవం

04-06-18(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

05-06-18(మంగళవారం) అభిషేకం పుష్పయాగం

బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్‌ 1వ తేదీ రాత్రి 9 నుండి 10 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.