ANNUAL DAY HELD _ ఘనంగా ఎస్వీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం

TIRUPATI, 07 MARCH 2023: The 137th annual day of TTD run SV High School was held on Tuesday evening in Tirupati.

 

DEO TTD Dr Bhaskar Reddy speaking on the occasion said the students should achieve higher goals in their lives with discipline and devotion.

 

Dr Vanajakshamma, a renowned Cardiologist from SVIMS informed the pupils of the healthy food and hygienic habits to be followed to lead a happy life.

 

Earlier, Head Mistress Smt Sandhya, read out the annual report of the school.

 

HDPP Co-ordinator Sri Hemanth Kumar, PD Sri Kumar, former Student’s Union President Sri Chandrasekhar and others were present.

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఘనంగా ఎస్వీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం

తిరుపతి, 2023 మార్చి 07: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల 137వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవస్థానం విద్యాశాఖ అధికారి డా.ఎం.భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలన్నారు.

ప్రత్యేక అతిథిగా విచ్చేసిన స్విమ్స్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ వి.వనజాక్షమ్మ మాట్లాడుతూ, విద్యార్థులు చక్కటి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జె.సంధ్య వార్షిక నివేదికను వినిపించారు.

హెచ్‌డిపిపి కో-ఆర్డినేటర్‌ డా.ఇజి.హేమంత్‌కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ శ్రీ కుమార్‌, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీ కె.చంద్రశేఖర్‌, పూర్వ విద్యార్థి శ్రీ ఎ.సంపత్‌కుమార్‌, టేక్వాండో కోచ్‌ శ్రీ గోపినాయుడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీ కె చంద్ర శేఖర్ వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ 60 వేల నగదు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.