ANNUAL FETE IN NARAYANAVANAM _ శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
ANNUAL FETE IN NARAYANAVANAM
TIRUPATI, 20 JULY 2022: The annual fete of Sri Bhadra Kaali Sameta Sri Veerabhadra Swamy temple at Narayanavanam will be observed between August 2 to 11 in a big way by TTD.
Starting with Ankurarpanam on August 2, Dhwajarohanam will be performed on the same day evening. The Kalyanotsavam will be on August 8 wherein two Grihastas will be allowed on payment of Rs.500 per ticket.
On August 9, Vasanthotsavam will be observed while on August 10, Veera Khadga Snanam and Dhwajavarohanam take place.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 2 నుండి 10వ తేదీ వరకు
శ్రీ వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2022 జూలై 20 ;నారాయణవనం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు 2 నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ఆగస్టు 2వ తేదీ ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 8 నుండి 10 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
ఇందులో భాగంగా ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సింహవాహనం, ఆగస్టు 4న సాయంత్రం భూత వాహనం, ఆగస్టు 5న సాయంత్రం శేష వాహనం, ఆగస్టు 6న రాత్రి 7 గంటలకు అగ్నిగుండం ప్రవేశం అనంతరం పులి వాహనంపై స్వామివారు విహరిస్తారు. అదేవిధంగా ఆగస్టు 7న సాయంత్రం గజవాహనం, ఆగస్టు 8న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం, అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల వరకు కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, లడ్డూ, అప్పం ప్రసాదాలను బహుమానంగా అందజేస్తారు.
ఆగస్టు 9 న సాయంత్రం 5 గంటలకు వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం, ఆగస్టు 10న ఉదయం 10 గంటలకు వీరఖడ్గస్నానం, మధ్యాహ్నం 3 గంటలకు పల్లకీ ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాయంత్రం హరికథలు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.