Annual Jyestabhishekam concludes in Sri Govindaraja Swamy Temple _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన జ్యేష్టాభిషేకం
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన జ్యేష్టాభిషేకం
తిరుపతి, 2012 జూలై 02: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం స్వామివారి కవచ ప్రతిష్ఠతో జ్యేష్టాభి షేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కళ్యాణ మండపంలోకి వేంచేపు చేశారు. కవచప్రతిష్ఠలో భాగంగా శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించా రు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకు రసం, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. అనంతరం మహాశాంతిహోమం, తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మోఘోష వినిపించారు. సాయంత్రం 6.00 గంటల నుండి 7.00 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నస్వామి, సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, కంకణబట్టర్ శ్రీ ఎ.టి.చక్రవర్తి శేషాద్రి దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ సుధాకర్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ పి.ఎస్.బాలాజీ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.