“ANNUAL PUSHPA YAGAM” _ ఈనెల 26వ తేదిన వార్షిక పుష్పయాగ మహోత్సవం

Tirupati, October 19, 2009: The Annual Pushpayaga Mahotsavam will be conducted in the temple of Lord Sri Venkateswara Swamy varu, Tirumala on October 26th with Ankurarpanam on October 25.  The Grihasthas intended to participate may avail this opportunity by paying Rs.3,500/- .  5 persons for each ticket will be allowed for this Utsavam  and they will be permitted Lord’s darshan. 

 

In view of this Utsavam on October 26th, Arjitha sevas such as Thomala, Archana, Visesha Pooja, Kalyanotsavam, Unjalseva(Dolotsavam), Arjitha Brahmotsavam and Vasanthotsavam will not be performed.  There will be no Thomala, Archana,  Vasanthotsavam and Sahasra Deepalankara seva on October 25 th due to Ankurarpanam.

 

 Special programmes such as Snapana Thirumanjanam by 9.00AM, Pushpa Yagam between 1.00 PM to 5.00Pm procession of Utsava deities in a procession around four mada streets after Sahasra Deepalankara seva after 6.30 PM on the same day.

Issued by the Public Relations Officer, TTD, Tirupati

ఈనెల 26వ తేదిన వార్షిక పుష్పయాగ మహోత్సవం

 తిరుమల, అక్టోబర్‌-19 , 2009: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 26వ తేదిన వార్షిక పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. అక్టోబర్‌ 25వ తేదిన అంకురార్పణ నిర్వహిస్తారు.

ఈ సేవలో పాల్గొనదలచిన భక్తులు 3500 రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఒక్క టిక్కెట్టుపై 5 మంది భక్తులను అనుమతిస్తారు. ఈ పుష్పయాగం సందర్భంగా అక్టోబర్‌ 25వ తేదిన శ్రీవారి ఆలయంలో నిత్యం జరిగే ఆర్జిత సేవలైన తోమాల,అర్చన, వసంతోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవ, తదితర సేవలు రద్దు చేశారు. అదేవిధంగా 26వ తేదిన తోమాల,అర్చన, వసంతోత్సవం, విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలను రద్దు చేయడమైనది.

ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల అనంతరం కార్తీకమాసంలో శ్రావణనక్షత్రం రోజున శ్రీమలయప్పకు ”పుష్పయాగం” జరుగుతుంది. పుష్పయాగం జరిగే రోజు యథాక్రమంగా రెండు అర్చనలు, రెండు నివేదనలు పూర్తి అయిన తర్వాత శ్రీదేవి,భూదేవి సమేతంగా దేవదేవున్ని కల్యాణ మండపానికి వేంచేస్తారు. హోమాలు, స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పిదప ఆ మధ్యాహ్నం శ్రీస్వామివారికి వివిధ రకాల సుగంధపరిమళ పుష్పాలతో పుష్పార్చన జరుగుతుంది. ఈ పుష్పాలు శ్రీవారి హృదయం వరకు రాగానే వీటిని తొలగిస్తారు. మళ్ళీ పుష్పార్చన జరుగుతుంది. ఇలా 20 మార్లు జరుగుతుంది. అనంతరం శ్రీవారికి ఘనంగా హారతి సమర్పిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.