ANNUAL TEPPOTSAVAM OF SRI GT FROM FEBRUARY 17-23 _ ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
Tirupati, 20 January 2024: The annual 7-day Teppotsavam of Sri Govindaraja Swamy temple will be observed from February 17-23 wherein the deities bless devotees on the specially decorated float and also parade on Mada streets daily.
Details of the festival are as below.
February 1 Sri Kodandarama Swamy – five rounds
February 18- Sri Parthasarathi Swamy – five rounds
February 19 Sri Kalyana Venkateswara Swamy – five rounds
February 20- Sri Krishna Swamy along, with Sri Andal Ammavaru -5 rounds
February 21,22,23 Sri Govindarajaswami- 7 rounds.
The artists of HDPP, Annamacharya projects will perform bhajans, Harikatha and Bhakti sangeet on all days.
ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
తిరుపతి, 2024 జనవరి 20: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వ నున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఫిబ్రవరి 17న శ్రీ కోదండరామస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 18న శ్రీ పార్థసారథిస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 19న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 20న ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు – 5 చుట్లు
ఫిబ్రవరి 21, 22, 23వ తేదీల్లో శ్రీ గోవిందరాజస్వామివారు – 7 చుట్లు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.