ANNUAL VASANTHOTSAVAM CONCLUDES _ ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

SVBC LIVE WITNESSED BY MILLIONS ACROSS THE GLOBE

Tirumala, 7 Apr. 20: The annual three-day Salakatla Vasanthotsavams concluded in Tirumala temple on  Tuesday.

On the final day Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi,
Sri Rama with Sita Devi, Lakshmana Swamy and Anjaneya Swamy and Sri
Krishna Swamy with Rukmini Devi were rendered celestial bath in
Kalyanotsava Mandapam.

It was a visual feast to the devotees who are present globally to
witness the snapana tirumanjanam to all the nine utsavarulu at a time
through the live streaming of the religious event on SVBC.


This religious event took place between 2pm and 4pm. In view of the
COVID 19 lockdown restrictions, TTD performed the event in
Kalyanotsava Mandapam this year instead of Vasanthotsava Mandapam.

In the presence of HH Sri Pedda Jiyar Swamy of Tirumala, HH Sri Chinna
Jiyar Swamy of Tirumala, Chief Priests Sri Venugopala Deekshitulu, Sri
Anantasayana Deekshitulu performed snapanam to deities with curd,
honey, turmeric and other aromatic sacred ingredients.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, CVSO
Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath were also present.

IN VOGUE SINCE 15TH CENTURY-EO

Speaking on this occasion, the TTD EO said, the annual Vasanthotsavams
are being observed in Tirumala every year from the last five
centuries. The three day event was observed in a solemn manner at
Kalyanotsava Mandapam in view of the ongoing COVID 19 lock down
restrictions.

ON SOCIAL MEDIA RUMOURS

The EO again clarified via media and appealed to the devotees not to
fall prey to the baseless rumours being spread by some vested elements
on Social Media about the various religious activities in Tirumala.

Brushing aside all the recent allegations about deviation in the
performance of daily rituals, the EO said, TTD has only closed darshan
for devotees under the instructions of Central and State governments
in view of the spread of dreadful Corona COVID 19 virus. “But the
daily rituals to the presiding deity of Lord Venkateswara from
Suprabhatam to Ekantam are being performed by the Archaka swamys
without deviation as per Agamas under the supervision of Sri Sri Sri
Pedda Jiyar Swami of Tirumala. In spite of our repeated
clarifications, these miscreants are spreading wrong news via Social
Media platform. I pray lord to give them wisdom and avoid spreading
false news against TTD”, he added.

TTD OFFERS SUPPORT

To tackle the COVID 19 virus spread, on the request of District
Collector we have released Rs.19crore towards the purchase of
Ventilators and other necessary medical equipment to be placed at Sri
Padmavathi Medical Hospital. We have already given Rs.8crore and
remaining Rs.11crore will be sanctioned soon. Apart from this we are
providing free meals to thousands of homeless labour and also
providing them shelter in our chowltries in Tirupati”, the EO
maintained.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమ‌ల‌, 2020 ఏప్రిల్ 07: తిరుమలలోని శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండపంలో గత మూడురోజులపాటు జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు మంగ‌ళ‌వారంనాడు ముగిశాయి.

తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో క‌లిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు.

కాగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ దాదాపు 500 సంవ‌త్స‌రాల నుండి శ్రీ‌వారి వ‌సంతోత్స‌వాల‌ను ప్ర‌తి ఏడాది వసంత ఋతువులో మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంద‌ని తెలిపారు. క‌రోనా వ్యాధి నేప‌థ్యంలో ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.

అదేవిధంగా సామాజిక మాధ్య‌మాలు వేదిక‌గా కొంద‌రు 2500 సంవ‌త్స‌రాల త‌రువాత శ్రీ‌వారి ఆల‌యాన్ని మూసివేశార‌ని, స్వామివారి కైంక‌ర్యాలు నిర్ణిత స‌మ‌యంలో జ‌ర‌గ‌డం లేద‌ని అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేశార‌న్నారు. దీనిపై  దేశ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ- మెయిల్ పంపుతున్నార‌ని, వారికి తిరిగి మెయిల్‌ ద్వారా స‌మాధానం పంపుతున‌ట్లు తెలిపారు. శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయర్‌స్వామివారి ఆధ్వ‌ర్యంలో అర్చ‌క స్వాములు తిరుమ‌ల‌ శ్రీ‌వారి ఆల‌యంలో ఉద‌యం సుప్ర‌భాతం నుండి రాత్రి ఏకాంత సేవ వ‌ర‌కు కైంక‌ర్యాల‌న్నీ వైఖాన‌స ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం జ‌రుగుతున్నాయ‌ని తెలియ‌జేశారు. ఆల‌యంలో జ‌రిగే అన్ని ఉత్స‌వాల‌లో సామాజిక దూరం పాటిస్తూ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. ఆల‌యంలో ప్ర‌తిరోజూ స్వామివారి క‌ల్యాణం, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాలైన ఉగాది ఆస్థానం, శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం, వ‌సంతోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తూ ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తున్నామ‌ని వివ‌రించారు.

క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల మేర‌కు జిల్లా యంత్రాగానికి టిటిడి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంద‌న్నారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా వైద్య క‌ళాశాల‌లో రాష్ట్ర‌స్థాయి కోవిడ్ ఆసుప‌త్రిని ఏర్పాటుచేశార‌ని, ఇందులో వెంట‌లేట‌ర్లు, ఇత‌ర వైద్య సామ‌గ్రి కొనుగోలుకు జిల్లా యంత్రాంగానికి రూ.19 కోట్లు మంజూరుచేశామ‌ని వివ‌రించారు. ఇందులో ఇప్ప‌టికే రూ.8 కోట్లు అంద‌జేశామ‌ని, మిగిలిన రూ.11 కోట్లు అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు.

అదేవిధంగా తిరుప‌తిలో ప్ర‌తిరోజూ  మ‌ధ్యాహ్నం, సాయంత్రం వేలది అన్న‌ప్ర‌సాద పొట్లాలు పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, మాధ‌వం విశ్రాంతి గృహాలు, రెండో స‌త్రం, తిరుచానూరులోని ప‌ద్మావ‌తి నిల‌యం భ‌వ‌నాల‌ను జిల్లా యంత్రాంగానికి అప్ప‌గించామ‌ని తెలిపారు.

టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటి, ఆరోగ్య‌, వైద్యం, అన్న‌ప్ర‌సాద విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నార‌ని, ఇత‌ర విభాగాల అధికారులు ఇంటి వ‌ద్ద నుండే ఈ-ఆఫీస్ ద్వారా పాల‌నా వ్య‌వ‌హారాలు సాగిస్తున్నార‌ని వివ‌రించారు. విధుల్లో ఉన్న టిటిడి అధికారులకు, సిబ్బందికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఇలా సామాజిక మాధ్య‌మాల్లో టిటిడిపై దుష్ప్ర‌చారం చేస్తున్న‌వారికి స్వామివారు మంచి బుద్ధి ప్ర‌సాదించిల‌ని ప్రార్ధిస్తున్న‌ట్లు తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, ఆల‌య‌ డెప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.