ANNUAL VASANTHOTSAVAMS IN KARVETNAGARAM _ కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు
ANNUAL VASANTHOTSAVAMS IN KARVRTINAGARAM
TIRUPATI, 20 APRIL 2022; The annual Vasanthotsavams in Sri Venugopala Swamy temple at Karvetinagaram are scheduled between April 21 to 23.
Every day there will be Snapana Tirumanjanam in the afternoon between 2.30 pm and 3.30 pm while Unjal Seva between 5:30 pm and 7:30 pm.
TTD is also organizing devotional cultural programs with Annamacharya Project artists.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకుకార్వేటినగరం
శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు
తిరుపతి, 2022 ఏప్రిల్ 20 ;కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటల వరకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఆస్థానం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పసుపు, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా మూడు రోజులపాటు సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లను ఘనంగా ఊరేగించనున్నారు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.