AP CM AND KARNATAKA CM OFFER PRAYERS _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఆంధ్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Tirumala, 24 Sep. 20: The Honourable Chief Minister of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy along with his Karanataka counterpart Sri BS Yediyurappa offered prayers in the temple of Lord Venkateswara at Tirumala on Thursday. 

Earlier, the AP CM was given warm reception on his arrival at Mahadwaram by TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti.

Later the AP CM received the Honourable Chief Minister of Karnataka, Sri BS Yediyurappa on the later’s arrival at Mahadwaram. Then both the CMs had darshan of Lord Venkateswara.

After darshan they were rendered Vedasirvachanam at Ranganayakula Mandapam. TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal offered Theerthaprasadams to the CMs of both the states.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న ఆంధ్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల ముఖ్యమంత్రులు

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 24: ఆంధ్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు  గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి,  గౌ|| శ్రీ బి.ఎస్‌.య‌డ్యూర‌ప్పలు క‌లిసి గురువారం ఉదయం శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా  ఆలయం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్ సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు. అనంత‌రం ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి గౌ|| శ్రీ బి.ఎస్‌.య‌డ్యూర‌ప్పకు  గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, టిటిడి అధికారులు స్వాగ‌తం ప‌లికారు.

స్వామివారి ద‌ర్శ‌నానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్ష్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ముఖ్య‌మంత్రులకు వేద‌పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం ఛైర్మ‌న్‌, ఈవో ఆంధ్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌ ముఖ్యమంత్రుల‌కు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రులు శ్రీ నారాయ‌ణ‌స్వామి, శ్రీ ఆళ్ల నాని, రాష్ట్ర మంత్రులు శ్రీ వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు‌, శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రా‌రెడ్డి, శ్రీ‌మ‌తి మేక‌తోటి సుచరిత‌, శ్రీ వేణుగోపాలకృష్ణ, శ్రీ కొడాలి నాని, చీఫ్‌ విప్ శ్రీ‌కాంత్‌రెడ్డి, ఎపిఐఐసి ఛైర్మ‌న్ శ్రీ‌మ‌తి ఆర్‌కె.రోజా, ఎంపిలు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, శ్రీ మిథున్‌రెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ క‌రుణాక‌ర్‌రెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీమ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ ముర‌ళికృష్ణ‌,శ్రీ  శివ‌కుమార్, శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అర్బ‌న్ ఎస్పీ శ్రీ ఎ.ర‌మేష్‌రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.