AP CM LAUNCHES KANNADA AND HINDI VERSIONS OF SVBC _ ఎస్వీబిసి కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించిన ముఖ్య‌మంత్రి గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

TIRUMALA, 12 OCTOBER 2021: The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy launched the Kannada and Hindi versions of Sri Venkateswara Bhakti Channel at Tirumala on Tuesday in the presence of HH Sri Sri Sri Subudendra Thirtha Swamy of Mantralaya Sri Raghavendra Swamy mutt.

With an aim to take forward the divine glory of Sri Venkateswara Swamy across the globe TTD has commenced Sri Venkateswara Bhakti Channel under the directive of the then CM of united Andhra Pradesh Late Sri YS Rajasekhara Reddy.

Under the Chairmanship of the then TTD trust board chief and present Tirupati Legislator Sri B Karunakar Reddy the SV Bhakti Channel was inaugurated by the then Honourable President of India Smt Pratibha Patil on July 7 in 2008.

All the annual religious events and festivals such as Nityotsavams, Varotsavams, Pakshotsavams, Masotsavams, Samvatsarotsavams including Srivari brahmotsavams, religious discourses, Parayanams, documentaries on important pilgrim centres etc. are being telecasted on SVBC for the sake of global devotees of Sri Venkateswara Swamy. Apart from the festivals, many spiritual and devotional music, dance, bhajans etc. are also been promoted via SVBC.

Especially the Parayanam programmes like Sundarakanda, Virata Parvam, Bhagavat Gita etc. telecasted during the pandemic period won the hearts of millions and millions of devotees across the world increasing the viewership by many folds.

As the number of pilgrims visiting Tirumala temple from Tamil Nadu or next to Telugu speaking States, upon the request of Tamil devotees TTD has launched SVBC Tamil on the occasion of Tamil Ugadi on April 14 in 2017. After its launch, the Tamil channel has also received an overwhelming response from Tamil devotees across the world.

Today, TTD has launched the Kannada and Hindi versions of SVBC over the hands of Honourable CM of AP for the sake of Kannada and Hindi speaking people who are spread across the globe and beget the blessings of Sri Venkateswara Swamy.

MPs Sri Gurumurty, Sri Mithun Reddy, Sri Prabhakar Reddy, Ministers Sri V Srinivasa Rao, Sri P Ramachandra Reddy, TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, Additional EO and SVBC MD Sri AV Dharma Reddy,

SVBC Chairman Dr Saikrishna Yachendra, SVBC CEO Sri Suresh Kumar and many others present.

Among others DIG Sri Krantirana Tata, Collector Sri Harinarayana, CVSO Sri Gopinath Jatti, Tirupati Urban SP Sri Venkatappala Naidu and other district administration officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

ఎస్వీబిసి కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించిన ముఖ్య‌మంత్రి గౌ|| శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

తిరుమల, 2021 అక్టోబ‌రు 12: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం ఆల‌యం బ‌య‌ట గౌ|| ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎస్వీబిసి కన్నడ, హిందీ భాషల్లో ఛానళ్లను మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి సమక్షంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభించారు.

శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంతోపాటు హిందూ ధర్మ ప్రచారం కోసం అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి గారి ఆదేశంతో టిటిడి ప్రతిష్టాత్మకంగా శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. 2008, జులై 7వ తేదీన అప్పటి టిటిడి ఛైర్మ‌న్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి గారి అధ్య‌క్ష‌త‌న‌, భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్‌ గారి చేతులమీదుగా ఎస్వీబీసీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నిత్య, పక్ష, మాస సేవలు, బ్రహ్మోత్సవాలు లాంటి ఎన్నో కార్యక్రమాలను గత 13 సంవత్సరాలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పిస్తోంది. శ్రీవారి సేవలతోపాటు సనాతన హిందూ ధర్మాన్ని, సనాతన సంప్రదాయాన్ని తెలియజేస్తూ ఎన్నో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రసారం చేస్తూ భక్తుల మన్ననలు పొందుతోంది.

శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వచ్చే తమిళ భక్తుల కోరిక మేరకు 2017వ సంవత్సరంలో తమిళ ఉగాది రోజున ఎస్వీబీసీ తమిళ ఛానల్‌ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా ఛానళ్లను ప్రారంభించి శ్రీవారి భక్తులు ఆ భాషల్లో కూడా స్వామివారి సేవలను వీక్షించే అవకాశం కల్పించడమైనది. దేశవిదేశాల్లో ఉన్న హిందీ మరియు కన్నడ భక్తులు శ్రీవారి సేవల ప్రసారాలు వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పొంద‌గ‌ల‌రు.

ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ ప్రభాకర్ రెడ్డి, శ్రీ గురుమూర్తి, టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు శ్రీ పి. రామచంద్రారెడ్డి, శ్రీ వి.శ్రీనివాసరావు, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో మ‌రియు ఎస్వీబిసి ఎండి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీ కరుణాకర్ రెడ్డి, ఎస్వీబిసి ఛైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర, సిఈవో శ్రీ సురేష్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.