AP CM RELEASES 2024 TTD DIARIES AND CALENDARS _ 2024 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

Tirumala, 18 September 2023: The Honourable CM of AP Sri Y.S. Jaganmohan Reddy released the TTD diaries and calendars for the year 2024.

It includes 12 sheet calendars -13.50 lakhs, big diaries – 8.25 lakh, small diaries – 1.50 lakhs, tabletop calendars – 1.25 lakhs, Srivari big calendars 3.50 lakhs, Sri Padmavati Ammavari calendars -10 thousand, Srivaru, Sri Padmavati Ammavari calendars – 4 lakhs, Telugu Panchangam – 2.50 lakh copies.

All these calendars and diaries will be made available in all TTD book stalls in Tirumala and Tirupati from September 22 onwards while in outside places from the Second week of October onwards.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2023

2024 టీటీడీ డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 18: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజైన సోమ‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.

12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్నడైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.50 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది.

డైరీలు, క్యాలెండర్లు సెప్టెంబరు 22 నుండి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుండి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.