AP GOVERNOR OFFERS PRAYERS TO HILL LORD_ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్…
Tirumala, 3 Oct. 19: His Excellency, the Honourable Governor of Andhra Pradesh, Sri Biswabhushan Harichandan offered prayers in the Hill Shrine of Sri Venkateswara Swamy on Thursday.
Earlier, on his arrival at the main entrance of the temple-Maha Dwaram, he was welcomed with the traditional Isthikaphal Swagatham by temple priests amidst chanting of Vedic hymns and Melam. He was cordially received by TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti.
After offering prayers to Dwajasthambham in the temple, the Governor had darshan of Lord Venkateswara. Later at Ranganayakula Mandapam, the Vedic Pundits offered him Vedasirvachanam.
The Chairman and EO presented the first citizen of the State, Thirtha Prasadams and laminated photo of Lord.
Speaking to media persons, after coming out of the temple, the Governor said, Brahmotsavams of Lord are being observed in a grand manner. I had the privilege to offer prayers during this auspicious occasion. I sought his divine blessings to serve the people country till the end of my life. Let the country achieve great heights, prosperity and be the happiest one in the world. For all these, I sought His blessings”, he said.
TTD Spl Invitee Sri Dusmanth Kumar Das, Temple DyEO Sri Haridranath, Peishkar Sri lokanadham and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్…
అక్టోబర్ 03, తిరుమల, 2019: తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి అర్చక బృందం కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో గౌ|| శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవో, తిరుమల ప్రత్యేకాధికారి కలిసి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.
ఈ సందర్భంగా గౌ|| గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వారికి సేవ చేసేందుకు శక్తి ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. భారతదేశం మరింత శక్తివంతమైన దేశంగా ఎదగాలని ప్రార్థించినట్లు తెలిపారు.
అంతకుముందు తిరుమల శ్రీ పద్మావతి వసతి సముదాయం వద్దకు చేరుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కు టిటిడి ఛైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ అన్బురాజన్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, వీజీవో శ్రీ మనోహర్, ఏవీఎస్వో శ్రీ చిరంజీవి ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.