AP GUV OFFERS PRAYERS _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్ గౌ.శ్రీ‌. బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌

TIRUMALA, 03 SEPTEMBER 2022: His Excellency, the Governor of Andhra Pradesh, Sri Biswabhushan Harichandan accompanied by his family and entourage offered prayers to Sri Venkateswara Swamy in Tirumala on Monday.

Earlier, on his arrival at the main entrance of the temple Maha Dwaram, he was welcomed with the traditional Isthikaphal Swagatham by temple priests amidst chanting of Vedic hymns and Melam. He was cordially received by TTD Chairman YV Subba Reddy, Executive Officer Sri AV Dharma Reddy.After darshan, he was rendered Vedasirvachanam in Addala Mandapam by Vedic Pundits and presented with Thirtha Prasadams, 2023 Calendar and Diaries of TTD on the occasion.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్ గౌ.శ్రీ‌. బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌

తిరుమల, 2022 అక్టోబ‌రు 03: తిరుమల శ్రీవారిని సోమ‌వారం రాష్ట్ర గవర్నర్ గౌ. శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ. గవర్నర్‌కు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ద‌ర్శ‌నానంత‌రం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత అద్దాల మండపంలో గౌ. గ‌వ‌ర్న‌ర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో శ్రీ‌వారి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్‌, తిరుప‌తి ఎస్పీ శ్రీ ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివోలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.