AP GUV OFFERS PRAYERS _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్

TIRUMALA, 14 MAY 2022: The Honourable Governor of Andhra Pradesh Sri Biswabhushan Harichandan offered prayers along with his family at Tirumala temple on Saturday evening.

Earlier on his arrival at Mahadwaram, he was offered a traditional Isthikaphal welcome by pundits and received by TTD EO Sri AV Dharma Reddy to the temple.

After darshan of Srivaru he was rendered Vedaseervachanam at Ranganayakula Mandapam and presented with Theertha Prasadams.

Honourable Deputy CM of AP Sri Narayana Swamy was also present.

Among others, Deputy EOs Sri Ramesh Babu, Sri Harindranath, RDO Sri Kanakanarasa Reddy, VGO Sri Bali Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్

తిరుమల, 2022 మే 14: తిరుమల శ్రీవారిని శ‌నివారం సాయంత్రం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టీటీడీ ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు.

ద‌ర్శ‌నానంత‌రం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో గౌ|| శ్రీ బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో తీర్థప్రసాదాలు అందించారు.

అంతకుముందు తిరుమల శ్రీ పద్మావతి వసతి గృహం వద్దకు చేరుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ హరీంద్రనాథ్, ఆర్ డివో శ్రీ కనక నర్సారెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.