APPALAYAGUNTA PAVITROTSVAMS _ అక్టోబ‌రు 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

TIRUPATI, 08 OCTOBER 2023: The annual Pavitra Utsavams in Appalayagunta will be observed between October 10-12 with Ankurarpanam on October 9.

On the first day Pavitra Pratishtha second day Pavitra Samarpana and the last day Pavitra Maha Purnahuti will be observed.

Every day there will be Snapana Tirumanjanam in the morning to the Utsava Murties.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER

అక్టోబ‌రు 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2023 అక్టోబరు 08: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 10 నుండి 12వ తేదీ వ‌ర‌కు పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకోసం అక్టోబ‌రు 9న సాయంత్రం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది.

యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల  తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబరు 10న పవిత్ర ప్రతిష్ట, అక్టోబరు 11న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబరు 12న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జ‌రుగ‌నుంది.  ప‌విత్రోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు.  

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది