APPLICATIONS INVITED FOR SV TRADITIONAL SCULPTURE COLLEGE _ ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 29 June 2022:TTD has invited applications from eligible students for Diploma, Certificate courses in ( traditional sculpture and kalamkari paintings) for the academic year  2022-23 at the SV  Traditional Institute of Traditional Sculpture and Architecture college.

Applications are available at the college from July 11-30 and completed applications should be submitted by July 30 evening at the college.

For all selected candidates for Diploma courses, TTD will deposit ₹1 lakh each in banks and is given to students after successfully completing the courses.

For more details on the courses, qualifications, and other details interested students could log into the TTD portal www.tirumala.org or contact the college office at 0877-2264637 during working hours.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, 2022 జూన్‌ 29 ; శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి గాను డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. కళాశాలలో జూలై 11 నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 30వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.

డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందిన వారికి లక్ష రూపాయల చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేసి ఉత్తీర్ణత సాధించిన అనంతరం నిబంధనలకు లోబడి చెల్లిస్తారు. కోర్సులు, విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637 నంబరులో పనివేళల్లో సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.