ARANYA PARVAM COMMENCES _ అరణ్యపర్వ పారాయణం ప్రారంభం

TIRUMALA, 24 JULY 2023: As part of the ongoing Parayana Yagnam Aranya Parvam commenced in the Nada Neerajanam platform on Monday evening.

Renowned scholar of SV Vedic University Sri Pavan Kumar Sharma narrates each Shloka while Dr Bharadwaja recites the Shloka everyday between 8pm and 9pm.

SV Vedic University VC Sri Rani Sadasiva Murty, Dharmagiri Veda Vignana Peetham Principal Sri KSS Avadhani and other scholars, devotees were also present.

SVBC telecasts this program between 8pm and 9pm for the sake of global pilgrims.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అరణ్యపర్వ పారాయణం ప్రారంభం

తిరుమల, 2023, జూలై 24: తిరుమల నాదనీరాజనం వేదికపై జరుగుతున్న మహాభారత ప్రవచనాల్లో భాగంగా సోమవారం రాత్రి అరణ్యపర్వ పారాయణం ప్రారంభమైంది.

తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ పవన కుమార శర్మ ప్రవచనం వినిపించగా, అతిథి అధ్యాపకులు డాక్టర్ భరద్వాజ శర్మ శ్లోకపారాయణం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు డా.కె.వందన పలు శ్రీకృష్ణ సంకీర్తనలను రాగయుక్తంగా గానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.

ఈ కార్యక్రమంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం నుంచి పలువురు పండితులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.