ARCHAKAS SHOULD PLAY A CENTRAL ROLE IN DHARMA PARIRAKSHANA-TTD EO_ ధర్మప్రచారంలో అర్చకుడు కేంద్ర బిందువుగా ఉండాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 16 October 2017: TTD EO Sri Anil Kumar Singhal advocated that the role of Archakas is not only to perform puja as per the prescribed tenets but also should play a vital role in the propagation of Hindu Dharma.

The EO took part in the valedictory session of the 15-day workshop held to SC,ST and fishermen community in SVETA bhavan in Tirupati on Monday.

Speaking on this occasion, the EO said, as a part of its Dharma Prachara, TTD has been constructing 500 temples in SC, ST and Fishermen colonies. “There are many temples today lying idle without any puja due to dearth of archakas especially in these colonies. To revive those temples, we have been training the SC, ST and Fishermen communities in Priesthood. Every year three batches will undergo training and continue to perform pujas in the temples in their respective home turfs. Thanks to the idea mulled by former TTD Executive Officer Late Sri PVRK Prasad who pioneered this noble programme”, he maintained.

Earlier, the 30-archakas who underwent training in this fourth batch recited mantras and performed Sita Rama Lakshmana Puja as per the Pujavidhi.

Special Officer of All Projects Sri N Muktheswara Rao, SVETA Special Officer Smt Chenchulakshmi, HDPP Secretary Sri Ramakrishna Reddy were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

ధర్మప్రచారంలో అర్చకుడు కేంద్ర బిందువుగా ఉండాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

అక్టోబరు 16, తిరుపతి, 2017: సనాతన ధర్మప్రచార కార్యక్రమాల్లో అర్చకుడు కేంద్ర బిందువుగా ఉండాలని, అర్చకుల మాటను ప్రజలందరూ గౌరవిస్తారని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో 3వ బ్యాచ్‌లో రెండు తెలుగు రాష్ట్రాలలోని 23 మంది ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకారులకు 15 రోజులుగా ఇస్తున్న అర్చక శిక్షణ సోమవారం ముగిసింది. అదేవిధంగా, 4వ బ్యాచ్‌లో 30 మంది ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకారులకు శిక్షణ ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకారులకు అర్చక శిక్షణతో సమాజంలో నూతన మార్పునకు టిటిడి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆలయ అర్చకుల పాత్ర ఎంతో విశిష్టమైందన్నారు. ఆలయంలో ధూపదీప నైవేద్యాలతో పాటు ప్రజల్లో ధార్మిక చింతన, భక్తిభావం పెంచాలని, సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయాలని కోరారు. పండుగలు, పర్వదినాల సందర్భంగా ప్రజలను పోగుచేసి ధార్మిక విషయాలను తెలియజేయాలని సూచించారు. ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణం జరుగుతోందని, వీటిలో స్థానికంగా ఉన్నవారినే అర్చకులుగా నియమించేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో బ్యాచ్‌కు మొత్తం మూడు విడతల్లో సంవత్సరం పొడవునా అర్చక శిక్షణ ఇస్తామని, ఇలా చేయడం వల్ల పరిపూర్ణత లుగుతుందని వివరించారు. కీ.శే శ్రీ పివిఆర్‌కె.ప్రసాద్‌ కృషితోనే ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణం సాధ్యమైందని, ఆయన సేవలు ఎనలేనివని ఈ సందర్భంగా ఈవో కొనియాడారు.

ముందుగా శిక్షణ పూర్తి చేసుకున్న అర్చకులు శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల వద్ద పూజా విధానాన్ని మంత్రయుక్తంగా చేసి చూపారు. అనంతరం పలువురు అర్చకులు తమ అనుభవాలను, శిక్షణలో నేర్చుకున్న విషయాలను, ఆలయాలకు వెళ్లిన తరువాత పాటించాల్సిన నియమాలను తెలియజేశారు.

అనంతరం అర్చక శిక్షణ పొందినవారికి ఈవో చేతులమీదుగా ప్రశంసాపత్రం, శ్రీవారు, అమ్మవారి చిత్రపటం, పూజ సామగ్రి, లడ్డూప్రసాదాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ముక్తేశ్వరరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి శ్రీ రామక ష్ణారెడ్డి, శ్వేత సంచాలకులు శ్రీమతి చెంచులక్ష్మి, ప్రాజెక్టు అధికారి శ్రీ రమణప్రసాద్‌, అర్చక శిక్షణ కో-ఆర్డినేటర్‌ డా|| పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, ఏఈవో శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.