ARCHAKAS SHOULD BECOME PATHSHOWERS TO THE SOCIETY-TTD EO _ అర్చకులు హిందూధర్మాన్ని కాపాడాలి

Tirupati 19 Feb: Archakas should become the path showers to the society with their deeds said TTD EO Sri LV Subramanyam.

 

Addressing the 15th Archaka Training class at SVETA in Tirupati on Tuesday he said, Archakas act as the bridge between Lord and His devotees. “A priest should always chant mantras and perform puja to Lord seeking the prosperity of the entire humankind. Then only the lord will shower blessings on the Priest. Being Archaka does not mean it is confined to one particular community. Any person can learn Archakatva by being pious and executing his duties with utmost dedication and dedication”, he added.

 

In his spiritual address Sri Sivananda Saraswathi Swamy of Sivanand Asram from Varanasi said, Archakas are the identity of Hindus and they should play a vital role in the protection and promotion of Hindu Sanatana Dharma.

Deputy EO Sri TAP Narayana, SVETA Director Sri Ramakrishna were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

అర్చకులు హిందూధర్మాన్ని కాపాడాలి

తిరుపతి, ఫిబ్రవరి 19, 2013  : అర్చకులు హిందూ ధర్మాన్ని కాపాడే సైనికుల్ల పనిచేయాలని వారణాసికి చెందిన శివానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శివానంద సరస్వతి స్వామి అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణా సంస్థ(శ్వేత)లో మంగళవారం 15వ హరిజన అర్చక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.
 
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ శివానందసరస్వతి స్వామి ప్రసంగిస్తూ భగవంతుని థావతారాలు వెలసిన భారతభూమిపై మానవ జన్మను పొందడం ఉత్కుృష్టమైనదని అన్నారు. అర్చకులు భగవంతుడికి భక్తుడికి వారధివంటి వారు కావున ధర్మ పరిరక్షణకు అర్చక వ్యవస్థ బలంగా ఉంటే ధర్మపరిరక్షణ బలంగా ఉంటుందని తెలిపారు. మన పూర్వీకులు నిరంతర కృషి, సాధనతో మనకు అందించిన సనాతన ధర్మాని అవగాహన కలిగించుకోవాలని ఆయన సూచించారు.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అర్చకులు సమాజానికి థ-దిశ నిర్ధేశకులు కావాలన్నారు. సమాజ శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడు అర్చకులు అర్చన చేసినప్పుడే ఆ స్వామి అర్చకుని యోగ క్షేమాలు స్వయంగా చూసుకుంటాడని తెలిపారు. అర్చకునికి ఉన్న సముచిత స్థానం, మన హిందు సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు కూడా కొనియాడారని ఆయన తెలియజేసారు. మన విద్యావిధానం ములాల నుండి పటిష్టమైనదని, పౌరహిత్యం అంటే కులానికి సంబంధించినది కాదని ఒక వ్యక్తి సత్ప్రవర్తన, గుణగణాలతో ముడి పడి ఉందని తెలిపారు.    
 
అనంతరం తితిదే  ప్రత్యేక శ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి(జనరల్‌) శ్రీ టి.ఎ.పి. నారాయణ ప్రసంగిస్తు భగవంతుడి దృష్టిలో అందరూ సమానం కావున అర్చక శిక్షణను అందరికి అందించేందుకు తితిదే కృషి చేస్తుందని తెలిపారు. హిందు సాంప్రదాయంలో ఉన్న తిలకధారణ, సంధ్యావందనం లాంటి విషయాలను యువతరానికి తెలియజెపాలని కోరారు. అర్చక శిక్షణ పొందిన వారు సత్ప్రవర్తనతో మెలిగి ప్రజలకు మార్గదర్శకులు కావాలని ఆకాంక్షించారు.
 
శ్వేత సంచాలకులు శ్రీ కె.వి.రామక్రిష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల మందికి అర్చక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కలియుగ ప్రత్యక్షదైమైన శ్రీవారి పాదాల చెంత అర్చక శిక్షణ పొందడం పూర్వజన్మ సుకృతం అన్నారు.  అర్చకత్వం ద్వారా హిందూ ధర్మాని పరిరక్షించుకుంటు ప్రచారం చేయాలని కోరారు.
 
కాగా అర్చక శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 23వ తేది వరకు ఐదు రోజుల పాటు జరగనుంది. ఈ శిక్షణకు రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుండి 100 మంది హాజరయ్యారు. వీరికి అర్చన ప్రయోగం, ప్రవర్తన నియమావళి, మానసిక వికాసం, ఆరోగ్యం, యోగా సూత్రాలు, హిందూ ధర్మ వైజ్ఞానిక సమన్వయం, అర్చకుని సామాజిక కర్తవ్యం తదితర విషయాలను బోధించనున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.