ARCHAKAS SHOULD BECOME ROLE MODELS- JEO SADA BHARGAVI _ అర్చకులు ఆదర్శంగా ఉండాలి- టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 24 November 2022: TTD JEO (Education & Health ) Smt Sada Bhargavi said that Archakas who have a niche in Sanatana Hindu Sanatana Dharma should lead a role model lifestyle observing the traditional practices in dress, language, food habits and sentiments.

Participating as Chief Guest during the three-day refresher training classes for TTD Archakas at SV Veda University on Thursday sponsored by SVETA,  the JEO said participation in such courses will help Archakas to empower and also impart knowledge in ancient practices and traditions to the society.

She said it was heartening that such in-house refresher training courses for Archakas are taking place after a decade with the initiatives of TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Sri AV Dharma Reddy.

The JEO said TTD would conduct such training programmes for Archakas across temples of Andhra Pradesh in a phased manner to hone up their skills in pujas and other religious programs.

Contending that Archakatvam is a profession which has been deserving of honours and respect across the country for several centuries, the JEO called upon the spiritual practitioners to maintain physical fitness through Yoga etc.

She said TTD pioneered in conducting such training programs for different skilled professionals and is the only institution in India offering such courses.

Agama Advisor Dr Vedantam Vishnu Bhattacharyulu, Sri Sitaramacharyulu, SV Veda University Registrar Acharya Radhe Shyam, SVETA Director Smt Prashanti were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అర్చకులు ఆదర్శంగా ఉండాలి- టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 24 నవంబరు 2022: సనాతన హిందూ ధర్మంలో అర్చకులకు గౌరవ స్థానం ఉందని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు. అర్చకులు తమ హావ, భావాలు, ఆహార్యం, వేష, భాషల్లో సంప్రదాయాలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆమె కోరారు.

శ్వేత ఆధ్వర్యంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ అర్చకులకు మూడు రోజుల పునశ్చరణ తరగతులు గురువారం ప్రారంభం అయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేఈవో శ్రీమతి సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్చకులు అప్పుడప్పుడూ ఇలాంటి పునశ్చరణ తరగతుల్లో పాల్గొనడం ద్వారా తమకు తెలిసిన విషయాలు ఇతరులతో పంచుకోవడం, తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందన్నారు. పదేళ్ళ తరువాత అర్చకులకు ఇలాంటి పునశ్చరణ తరగతులు నిర్వహించడం సంతోషమన్నారు. టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ప్రోత్సాహంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని అర్చకులందరికీ విడతల వారీగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు జేఈవో వివరించారు. అర్చకులు తమశారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం యోగా కూడా చేయాలని సూచించారు. భారతదేశంలో చేతులెత్తి మొక్కే వృత్తి అర్చకత్వం మాత్రమేనని, వీరు అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆమె కోరారు. శ్వేతలో ఇటీవల కాలంలో భిన్న రంగాల వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అర్చక శిక్షణ లాంటి కార్యక్రమాలు దేశంలో పెద్ద ఎత్తున నిర్వహించే శక్తి టీటీడీకి మాత్రమే ఉందన్నారు.

ఆగమ సలహాదారులు శ్రీ వేదాంతం విష్ణు భట్టాచార్య, శ్రీ సీతారామాచార్యులు, వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యామ్, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది