ARJITHA SEVA ELECTRONICS DIP FROM APRIL 1 AT CRO- TOKENS FOR ANGA PRADHIKSHNA _ ఏప్రిల్ 1వ తేదీ నుండి సిఆర్వో వద్ద ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆర్జిత సేవలు
Tirumala ,23, March 2022: As before covid restrictions two years ago, TTD is organising electronic lucky dips for issuing arjita Seva tickets from April 1 onwards,
As part of the process, TTD has already commenced the issue of online arjita Seva tickets for the months of April, May and June on March 20th.
As in the past, TTD will conduct an electronic lucky dip for allotment of Arjit Seva tickets offline a day before to devotees at the CRO office. If devotees register their names from morning to evening on the prior day Arjita’s Seva tickets will be issued offline later on the electronic lucky dip,
Similarly, metal detectors counters could also procure for Anga Pradakshina tokens at PAC-1 from April 1.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 1వ తేదీ నుండి సిఆర్వో వద్ద ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆర్జిత సేవలు
భక్తులకు అంగప్రదక్షిణ టోకెన్లు
తిరుమల, 2022 మార్చి 22: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకోసం కోవిడ్-19 ముందు ఉన్న పద్ధతులనే అవలంబిస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20న ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, గతంలో ఇస్తున్న విధంగానే తిరుమల సిఆర్వో కార్యాలయం వద్ద గల కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయించనుంది. ఇందుకోసం భక్తులు ముందురోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నమోదు చేసుకుంటే ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేసి టికెట్లు కేటాయిస్తారు.
అదేవిధంగా, భక్తులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి పిఏసి-1 వద్ద అంగప్రదక్షిణ టోకెన్లు కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.