ARRANGE FLEXI BOARDS IN FOOTPATH ROUTES – JEO_ నడకమార్గాల్లో టోకెన్ల జారీపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి : తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు

Tirumala, 24 July 2017: For the benefit of pedestrian pilgrims arrange flex boards in Alipiri and srivarimettu footpath routes said, Tirumala JEO Sri KS Sreenivasa Raju.

The JEO had inspected both footpath routes on Monday evening and personally monitored the divya darshan token system. Later he directed the officials concerned to make necessary arrangements of sheds, RO water plants, toilets etc. In Alipiri route as majority prefer to trek this footpath.

“The flex boards should be displayed in five languages for the information of the pilgrims”, he added. The devotees also expressed their happiness over the new token system and thanked TTD for all the arrangements.

Earlier he has also inspected the vehicle parking area at Alipiri, near zoo park, SV Medical College and Bhavan’s school on Garuda Seva day during the ensuing brahmotsavams.

Additional cvso Sri Sivakumar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, IT wing head Sri Sesha Reddy and others were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నడకమార్గాల్లో టోకెన్ల జారీపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి : తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌ శ్రీనివాసరాజు

తిరుమల, 2017 జూలై 24: తిరుమల దర్శనార్థం కాలినడకన వస్తున్న భక్తులకు టోకెన్ల జారీ విధానాన్ని తెలియజేసేందుకు అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో 5 భాషల్లో ఫ్లెక్సీ బోర్డులను ఏర్పాటు చేయాలని టిటిడి తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. శ్రీవారిమెట్టు, అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి జెఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీవారిమెట్టు నడకమార్గంలో ఏర్పాటుచేసిన నాలుగు టోకెన్ల జారీ కౌంటర్లను అవసరాన్ని బట్టి వినియోగించాలని సూచించారు. ఈ మార్గంలో ఉన్న వ్యర్థాలను తొలగించాలన్నారు. అలిపిరి నడకదారిలోని టోకెన్‌ జారీ కౌంటర్‌ వద్ద ఎక్కువ మంది భక్తులు వేచియుండే అవకాశం ఉందని, వారి సౌకర్యార్థం ఇక్కడ షెడ్‌, తాగునీటి ప్లాంట్లు, మరుగుదొడ్లు విరివిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు సమాచారం తెలిపేలా అలిపిరి మొదటి మెట్టు నుంచి అవసరమైన ప్రాంతాలలో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు.

అనంతరం అలిపిరి వద్ద టోకెన్‌ మంజూరు కౌంటర్లను, భక్తులను తనిఖీచేసే విధానాన్ని పరిశీలించారు. అలిపిరి మార్గంలో టోకెన్ల జారీపై కాలినడక భక్తుల స్పందన ఎలా ఉందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టోకెన్లు జారీ చేసి త్వరితగతిన శ్రీవారి దర్శనం చేయిస్తుండటంపై జెఈవో ఎదుట పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

గరుడ సేవ కోసం పార్కింగ్‌ ప్రదేశాలను పరిశీలించిన జెఈవో

శ్రీవారి బ్రహ్మూెత్సవాలలో భాగంగా గరుడసేవ రోజున విశేషసంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వాహనాల పార్కింగ్‌ స్థలాలను సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి జేఈవో పరిశీలించారు. జూపార్క్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న దేవలోక్‌ ప్రాంగణం, భారతీయ విద్యాభవన్‌ పాఠశాల మైదానం, ఎస్వీ మెడికల్‌ కళాశాల మైదానం, అలిపిరి సర్కిల్‌ వద్ద గల ప్రాంతాలలో పార్కింగ్‌ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

తిరుమల జేఈవో వెంట టిటిడి అదనపు సీవీఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్‌ఈలు శ్రీరామచంద్రారెడ్డి, శ్రీ రమేష్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్‌ జీఎం శ్రీ శేషారెడ్డి, ఈఈలు శ్రీ మనోహరం, శ్రీశివరామకృష్ణ, డిఈలు శ్రీ రవిశంకర్‌ రెడ్డి, శ్రీ చంద్రశేఖర్‌, ఈడీపీ మేనేజర్‌ శ్రీ భాస్కర్‌ తదితరులు ఉన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.