ARRANGEMENTS UNDERWAY TO OBSERVE VONTIMITTA ANNUAL FETE IN A BIG WAY-TTD JEO _ అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు

STATE FESTIVAL OF SRI SITA RAMA KALYANAM ON APRIL 5

TIRUPATI, 08 FEBRUARY 2023: The arrangements by TTD to observe the annual brahotsavams in Sri Kodanda Ramalayam at Vontimitta are underway, said TTD JEO Sri Veerabrahmam.

As the annual fete is scheduled to commence with Ankurarpanam on March 30 onwards, the TTD has already began the arrangements two months prior to the mega fete. After inspecting the ongoing arrangements at the temple and in Kalyana Vedika, the JEO reviewed with the officials of various departments to know the status of works pertaining to each department. 

Later talking to media persons he said, all the arrangements will be completed within the time schedule and the Honourable Chief Minister of AP Sri YS Jaganmohan Reddy will present the silk vastrams on behalf of the State Government on April 5 on the auspicious occasion of the celestial Sita Rama Kalyanam. 

The JEO said the arrangements of entry-exit gates, galleries, annaprasadam, drinking water arrangements, spiritual cultural  programmes including dance and music, floral and electrical decorations, security etc. have been reviewed. “In the next two weeks, TTD EO Sri AV Dharma Reddy will hold a review meeting with all the officials”, he maintained.

TTD CE Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, EE Smt Sumati, DyEOs Sri Natesh Babu, Sri Subramanyam, Sri Gunabhushan Reddy, Additional HO Dr Sunil Kumar, DFO Sri Srinivas, Deputy Director of Garden Sri Srinivasulu, DE Electrical Sri Chandrasekhar, Special Officer Catering Sri GLN Shastry, Publications Wing Special Officer Sri Ramaraju and other officials were also present.

Earlier, the JEO also inspected the ongoing development works at the 108-feet statue of Sri Tallapaka Annamacharya in Rajampet district.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు

– ఏప్రిల్ 5న స్వామివారి కల్యాణం
– ముఖ్యమంత్రి చే పట్టు వస్త్రాల సమర్పణ

టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 8 ఫిబ్రవరి 2023: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 30వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆయన అధికారులతో కలసి క్షేత్రస్థాయిపరిశీలన, సమీక్ష జరిపారు.

అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడారు. మార్చి 30వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు, స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. నెలరోజుల ముందు నుంచే టీటీడీ
ఈ పనులను ప్రారంభించిందని శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా నిర్వహిస్తామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి రెండు వారాల్లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. టీటీడీ చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వరరావు విద్యుత్ విభాగం ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, డిప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్ రెడ్డి, శ్రీ సుబ్రహ్మణ్యం, ఈ ఈ శ్రీమతి సుమతి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ డిఈ శ్రీ చంద్రశేఖర్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ రామరాజు పాల్గొన్నారు.

అంతకు ముందు జేఈవో శ్రీ వీరబ్రహ్మం రాజంపేట లోని 108 అడుగుల శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య విగ్రహం ఆవరణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది