ASTABANDHANA BALALAYA MAHA SAMPROKSHANAM CONCLUDES _మొదటి ఘాట్ రోడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన అష్టబంధన మహాసంప్రోక్షణ
TIRUMALA, 15 APRIL 2022:The Astabandhana Balalaya Maha Samprokshanam of Sri Lakshmi Narasimha Swamy temple located in the First Ghat Road concluded on Friday.
TTD Chairman Sri YV Subba Reddy, Chief Priest Sri Venugopala Deekshitulu, Agama Advisor Sri Mohana Rangacharyulu, Sri Bava Narayanacharyulu, VGO Sri Bali Reddy were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మొదటి ఘాట్ రోడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన అష్టబంధన మహాసంప్రోక్షణ
తిరుమల, 2022 ఏప్రిల్ 15: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ముగిసింది.
ఆలయంలో ఐదు రోజుల పాటు అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి.
ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 8.30 గంటల వరకు భగవత్ ప్రార్ధన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణనయం, ప్రధాన కళాశాల వాహన, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు మహా పూర్ణాహూతి, ఉదయం 9.30 గంటలకు విమాన గోపుర శిఖర ఆవాహన, మూలస్థాన వాహనం నిర్వహించారు. మధ్యాహ్నం 12.10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ శ్రీ వైవి. సుబ్బారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, శ్రీ బావ నారాయణాచార్యులు, విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.