ASTABANDHANA HOMAMS COMMENCES IN TIRUMALA TEMPLE _ శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
Tirumala, 12 August 2018: The homams commenced in Yagashala on Sunday morning as a part of the five day, Astabandhana Balalaya Maha Samprokshanam religious fete.
Earlier during the day, the Ritwiks began the celestial yaga by litting up a Homa Gundam and performed Punyahavachanam followed by Panchagavyaradhana, Vastu Homam and Raksha Bandhanam.
GOLDEN “KURCHI”
The temple management has prepared a golden “Kurchi”, in traditional vedic jargon known as Darbha (holy dried grass which is usually used during holy rituals as a purifactory material). This Golden Kurchi weighed around 300 grams. This will be placed along with the Golden Kalasam in Yagashala after invoking the presiding deity of Sri Venkateswara Swamy during Kalakarshana ceremony which will be observed on Sunday evening between 7pm and 9pm.
Tirumala JEO Sri KS Sreenivasa Raju, Temple DyEO Sri Harindranath, Temple Peishkar Sri Ramesh Babu, Sri Nagaraju,Bokkasam Superindent Sri Gururaja rao were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం
ఆగస్టు 12, తిరుమల 2018 ; తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.
ఉదయం ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేపట్టారు.
బంగారు కూర్చ సిద్ధం :
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారుకూర్చను టిటిడి సిద్ధం చేసింది. 300 గ్రాముల బంగారంతో దీనిని తయారుచేశారు. సాధారణంగా వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతోపాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్టిస్తామని తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమల జెఈవో శ్రీకె.ఎస్.శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్లు శ్రీ రమేష్‌బాబు,శ్రీ నాగరాజ,బొక్కసం సూపరింటెండెంట్ శ్రీ గురురాజారావు ,ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.