ASTABANDHANA MAHASAMPROKSHANA AKNKURARPANA AT ALIPIRI _ అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirupati, 20 Nov. 20: Ankurarpana for Astabandhana Mahasamprokshana was performed at Sri Lakshmi Narayanaswamy temple at Alipiri on Friday.

Maha Samprokshana will take place from November 21 to 25.

Spl. Gr. Dy E O Sri Rajendrudu and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
 
తిరుపతి, 2020 న‌వంబ‌రు 20: తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల  శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన జీర్ణోద్ధ‌రణ మహాసంప్రోక్షణకు శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయంలో న‌వంబరు 21 నుండి 25వ తేదీ వరకు  ఐదు రోజుల పాటు అష్టబంధన మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. 
 
ఈ సందర్భంగా శుక్ర‌వారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆచార్య ఋత్విక్‌వరణం, అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 7.30 గంటల వరకు అంకురార్పణం నిర్వ‌హించారు.
 
ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ రాజేంద్రుడు, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ సుందరవరద భట్టాచార్యులు, ఏఈవో శ్రీ రవికుమార్, కంకణభట్టార్ శ్రీ మురళీ కృష్ణ ఆచార్యలు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఆర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
 
అష్టబంధన మహాసంప్రోక్షణ :
 
సాధారణంగా ఆలయంలో కొలువైన మూలవిరాట్టులు, పరివార దేవతల దేవతల విగ్రహాల పాదాల కింద ఉన్న పద్మపీఠానికి మధ్యలో అష్టబంధన లేపనము పూసి అతికించబడి ఉంటాయి. ఇందువల్ల విగ్రహాలు కదలకుండా ఉంటాయి. ఆలయ సన్నిధిలో ప్రతిరోజూ జరిగే కైంకర్యాలు, అభిషేకాలు, ధూపదీపాల వల్ల వచ్చే వేడి మొదలైన వాటివల్ల కాలక్రమంలో అష్టబంధనము ఊడి విగ్రహాలు కదులుతాయి. 
 
ఇలా జరగకుండా చూసేందుకు సాధారణంగా ఆలయాల్లో 12 సంవత్సరాలకోసారి అష్టబంధన మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆగమ పండితుల సూచన మేరకు అవసరమైన సమయాల్లోనూ ఈ కార్యక్రమం చేపడతారు. 
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.