ASTHANAM PERFORMED_ ఘ‌నంగా శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆస్థానం

Tirupati, 6 Sep. 19: The customary temple court-Asthanam was performed to Andal Sri Goda Devi and Pundaarikavalli Tayar in Sri Govindaraja Swamy temple in Tirupati on Friday.

In the evening the deities were taken on a celestial procession along mada streets.

Temple spl.gr.dyeo Smt Varalakshmi, AEO Sri Ravi Kumar Reddy, temple inspector Sri Krishna Murthy and others were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘ‌నంగా శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆస్థానం

తిరుపతి, 2019 సెప్టెంబ‌రు 06: తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీక‌వ‌ళ్లి అమ్మ‌వారికి ఘ‌నంగా ఆస్థానం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారికి లక్ష్మి మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఇందులో వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంగీత కార్యక్రమాలు వీనులవిందుగా సాగాయి. అనంతరం చిన్నమాడ వీధిలో ఊరేగింపు జ‌రిగింది. ఆ తరువాత శ్రీ ఆండాళ్, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారి ఆలయాల్లో శ్రీశ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి సమక్షంలో శుక్రవార ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వరలక్ష్మి, ఏఇఓ శ్రీ రవికుమార్ రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.