ASTOTTARA SATA KALASABHISHEKAM AT SRI KRT _ శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
Tirupati, 13 Oct. 19: The celestial fete of Astottara Sata Kalasabhishekam was performed in Sri Kodanda Rama Swamy temple at Tirupati on Sunday.
In the evening there will be the procession of Utsava deities on Tiruchi.
Temple AEO Sri Tirumalaiah, Temple Inspector Sri Ramesh were also present.
SITA RAMA KALYAM ON OCTOBER 21
In connection with Punarvasu Nakshatram, Sri Sita Rama Kalyanam will be observed on October 21 in the temple at 11am.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి, 2019 అక్టోబరు 13: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని ముఖమండపంలో ఉదయం 9.00 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల ఏఈవో శ్రీ తిరుమలయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అక్టోబరు 21న శ్రీకోదండరామాలయంలో కల్యాణోత్సవం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబరు 21వ తేదీ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది.
శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలుచేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.