ASWA VAHANA MARKS CONCLUSION OF VAHANA SEVAS _ అశ్వ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి ద‌ర్శ‌నం

Vontimitta, 24 April 2024:The vahana sevas concluded on Wednesday evening at Vontimitta Sri Kodanda Rama Swamy giving Darshan to devotees riding Aswa Vahanam.

Sri Rama appeared in Kalki Avatara.

Deputy EO Sri Natesh Babu, Superintendent Sri Hanumantaiah, Temple Inspector Sri Naveen and a large number of devotees participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అశ్వ‌వాహ‌నంపై శ్రీ కోదండరామస్వామి ద‌ర్శ‌నం

ఒంటిమిట్ట, 2024 ఏప్రిల్ 24: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామివారు ద‌ర్శ‌న‌మిచ్చారు.

రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామి అశ్వవాహనం అధిష్టించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.