ASWA VAHANAM HELD _ అశ్వ వాహనంపై సోమస్కందమూర్తి
TIRUPATI, 17 FEBRUARY 2023: On the seventh day evening on Friday, Sri Somaskanda Murty took out a celestial ride on Aswa Vahanam to bless His devotees during Sri Kapileswara Swamy brahmotsavams.
District Collector Sri Venkatramana Reddy, JEO Sri Veerabrahmam, DyEO Sri Devendra Babu and others were present.
అశ్వ వాహనంపై సోమస్కందమూర్తి
తిరుపతి, 17 ఫిబ్రవరి 2023: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాన్ని అధిష్టించి కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణారెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.