ASWA VAHANAM IN GT _ అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tirupati, 24 May 2024: On the eighth evening, Aswa Vahana, the last among Vahana sevas was observed under the pleasant Pournami light.

Sri Govindaraja as Kalki took out a celestial ride atop the divine Horse carrier along four mada streets to bless His devotees.

Both the senior and junior pontiffs of Tirumala, FACAO Sri Balaji, DyEO Smt Shanti and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి

తిరుపతి, 2024 మే 23: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి 7 గంట‌లకు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై స్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు.

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.

వాహన సేవలో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఎఫ్ ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజీ, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, సూప‌రింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధ‌నంజ‌యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.