AUDIO CD LAUNCHED _ 3 వేల అన్నమయ్య సంకీర్తనల రికార్డింగ్ పూర్తి : టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్

Tirupati, 28 July 2018: Annamaiah Audio CD, Srivari Archavatara Sannidhi is released on Saturday evening at Annamacharya Kalamandiram.

The songs were composed by Sri. G.Madhusudana Rao and sung by Sri.P.Munirathanam Reddy, Spl.Gr.DyEO and Sri. C.Balasubramanyam of electrical department of TTD.

The CD was released on the advent of Sravana Nakshatram on Saturday. The artistes presented some sankeertanas and enthralled audience.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

3 వేల అన్నమయ్య సంకీర్తనల రికార్డింగ్ పూర్తి : టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్

తిరుపతి,28 జూలై 2018 ; శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా ఇప్పటివరకు 3 వేల అన్నమయ్య సంకీర్తనల రికార్డింగ్ పూర్తి చేశామని టిటిడి తిరుపతి జెఈఓ శ్రీ పోల భాస్కర్ వెల్లడించారు.

శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ‌నివారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తనలను జెఈఓ శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ 5 ఏళ్ల తక్కువ వ్యవధిలో 1500 సంకీర్తనల రికార్డింగ్ పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. ఇందుకు కృషి చేసిన ఎస్‌.వి.రికార్డింగ్‌ ప్రాజెక్టు టెక్నికల్ సిబ్బందిని అభినందించారు. అన్నమాచార్య కళామందిరాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్టు చెప్పారు.

”అన్నమయ్య అర్చావ‌తార స‌న్నిధి” సిడిలోని సంకీర్తనలను అన్నమాచార్య ప్రాజెక్టు గాయకుడు శ్రీ జి.మ‌ధుసూద‌న‌రావు స్వరపరచగా టిటిడి ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో, ఎస్‌.వి.రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ‌ మునిర‌త్నంరెడ్డి, టెక్నిక‌ల్ అధికారి శ్రీ సి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం క‌లిసి గానం చేశారు. అనంతరం ఈ కీర్తనలను వీరు రసరమ్యంగా ఆలపించారు.

ఈ సందర్భంగా ఎస్‌.వి.రికార్డింగ్‌ ప్రాజెక్టు రికార్డింగ్ ఇంజినీర్లు శ్రీ రామస్వామి, శ్రీ రమేష్, టెక్నీషియన్ శ్రీ సతీష్ కుమార్, టెక్నికల్ హెల్పర్ శ్రీ దామోదర్ శెట్టిని శాలువ, శ్రీవారి ప్రసాదంతో జెఇఓ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, వయోలిన్ విద్వాంసురాలు శ్రీమతి చల్లా ప్రభావతి, అన్నమాచార్య ప్రాజెక్టు గాయకుడు శ్రీ బి.రఘునాథ్
ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.