MAHALAKSHMI NILAYAM MODERNIZED FOR POTU WORKERS INAUGURATED _ తిరుమ‌ల‌లో పోటు కార్మికుల కొర‌కు ఆధునీక‌రించిన మ‌హాల‌క్ష్మీ నిల‌యం ప్రారంభం

Tirumala, 15 Dec. 19: The modernized accommodation for the potu workers at Tirumala, Mahalakshmi Nilayam was inaugurated by temple Dyeo sri Harindranath.

The  75  rooms of the F block of TTD quarters was renewed to house 420 potu workers near  the Kausthubham rest houses by TTD at a cost of Rs.7 crores with tiles, toilets freshly painted rooms, fans, geysers, and sleeping cots. 

Earlier  the potu workers were accommodated at the Govinda Nilayam, Vakulamata and Asta Vinayaka Rest Houses.

OSD of Srivari Temple Sri Pala Sheshadri,  EE-5 Sri  Chandrasekhar, AEO Potu Sri Srinivas, other officials participated.     

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమ‌ల‌లో పోటు కార్మికుల కొర‌కు ఆధునీక‌రించిన మ‌హాల‌క్ష్మీ నిల‌యం ప్రారంభం

తిరుమ‌ల‌, 2019 డిసెంబరు 15: తిరుమ‌ల శ్రీ‌వారి పోటు కార్మికుల‌ వ‌స‌తి కొర‌కు అత్యాధునిక వ‌స‌తుల‌లో నిర్మించిన మ‌హాల‌క్ష్మీ నిల‌యంను ఆదివారం ఉద‌యం శ్రీ‌వారి ఆల‌యం డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ ప్రారంభించారు.

తిరుమ‌లలో కౌస్తుభం స‌మీపంలో పోటు  కార్మికుల‌ వ‌స‌తి కొర‌కు ఎఫ్ – టైపు క్వార్ట‌ర్స్‌లోని 3 బ్లాక్‌ల‌ను టిటిడి రూ.7 కోట్ల‌తో ఆధునీక‌రించింది. ఇందులో 75 గ‌దులలో 2 గ‌దులు కార్యాల‌యంకు, ఒక గ‌ది  డైనింగ్ హాల్‌కు ఉప‌యోగించ‌నున్నారు.  మిగిలిన గ‌దుల‌లో 420 మంది పోటు కార్మికుల‌కు వ‌స‌తి స‌దుపాయం క‌ల్పించారు. భ‌వ‌నంలోని సీలింగ్‌, గోడ‌లు, ఫ్లోరింగ్‌, మ‌రుగుదొడ్ల‌కు ఆక‌ర్ష‌ణీయంగా టైల్స్, రంగులు వేశారు. భ‌వ‌నంలో కొత్త త‌లుపులు, కిటికీలు అమ‌ర్చి, ఫ్యాన్లు, గీజ‌ర్లు, మంచాలు, ప‌రుపులు ఏర్పాటు చేశారు.
 

ఇంత‌కుముందు పోటు కార్మికులు గోవింద‌నియం, వ‌కుళామాత‌, అష్ట‌వినాయ‌క‌ అతిథి భ‌వ‌నాల‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నూత‌నంగా ప్రారంభించిన మ‌హాల‌క్ష్మీ నిల‌యంలో పోటు కార్మికుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, పోటు ఏఈవో శ్రీ శ్రీ‌నివాస్‌, ఇఇ-5 శ్రీ చంద్ర‌శేఖ‌ర్ ఇతర అధికారులు, పోటు సిబ్బంది పాల్గొన్నారు.  

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.