SUNDARAKANDA AKHANDA PARAYANAMS RESUMES ON NOVEMBER 3 _ నవంబరు 3న సుంద‌రకాండ 20 నుండి 24వ‌ సర్గ శ్లోక అఖండ పారాయ‌ణం

Tirumala, 2 Nov. 20: TTDs spiritual program to deliver the global humanity from pandemic Covid, the sixth edition of Akhanda Sundarakanda parayanam, will be resumed on Tuesday, November 3.

As part of the program Vedic parayanadars will recite 185 shlokas from 20-24. Sargas of Sundarakanda at the Nada Niranjanam platform, Tirumala daily from morning 07.00 am.

About 200 parayanadars from Dharmagiri Veda vijnan peetham, S V Veda University, and Rastriya Sanskrit University will be participating in the yeomen dharmic program of TTD.

The SVBC channel will give telecast of the program which devotees of Sri Venkateshwara could emulate in parayanams at their homes and beget Srivari blessings.

TTD has successfully conducted five editions of Sundarakanda parayanams so far.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 3న సుంద‌రకాండ 20 నుండి 24వ‌ సర్గ శ్లోక అఖండ పారాయ‌ణం

తిరుమల, 2020 న‌వంబ‌‌రు 02: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై నవంబరు 3వ తేదీ మంగళవారం 6వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు ఉన్న 185 శ్లోకాలను పారాయణం చేస్తారు.

తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

కాగా, ఇప్ప‌టివ‌ర‌కు ఐదు విడ‌త‌ల్లో అఖండ పారాయ‌ణం జ‌రిగింది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.