DEVOTIONAL CULTURAL BONANZA ON FIVE PLATFORMS FOR AMMAVARI BTUs _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా కళాప్రదర్శనలు
Tirupati, 15 Nov. 19: The TTD is all set to observe the Navahnika Karthika Brahmotsavams of Sri Padmavathi Devi Ammavaru at Tiruchanoor in a big way from November 23 to December 1.
As a part of this Nine-day mega religious fete, the devotional cultural programmes have also been planned on five different platforms including Asthana Mandapam at Tiruchanoor, Mahati Auditorium, Annamacharya Kalamandiram, Ramachandra Pushkarini and Silparamam.
Every day the devotional cultural programmes including Nadaswaram, Vedapathanam, Instrumental, Vocal and classical dance by renowned artistes hailing from different parts of the country are set to muse the devotees and denizens during the festive days.
TTD has also invited artistes to send their performance CDs so that the selection committee will decide and provide them to perform in front of various vahana sevas during Ammavari brahmotsavams.
Already traditional artforms like Garagalu, Pillanagrovi, Kolatam teams are going to lure devotees. Apart from this the stages of Tyagayya, Ramadasu, Annamacharya, Purandharadasa will also be set up in the four corners of mada streets during vahana Seva where the artists present the sankeertans of the respective saint musicians.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
—
Pl visithttp://news.tirumala.org
తిరుపతి, 2019 నవంబరు 15: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 23 నుండి డిసెంబరు 1వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సారి వాహనసేవలతోపాటు వివిధ వేదికలపై కళాప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందుకోసం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వివిధ వేదికలపై శాస్త్రీయసంగీతం, భక్తిసంగీతం, వాయిద్య సంగీతం(అన్నమయ్య, దాససాహిత్య, త్యాగరాయ, రామదాసు సంకీర్తనలు), కూచిపూడి నృత్యం, భరతనాట్యం, నృత్యరూపకం, హరికథాగానం, బుర్రకథ, జానపదకళలు ప్రదర్శిస్తారు. వాహనసేవల్లో కూచిపూడి, భరతనాట్యం, నృత్యరూపకం, కోలాటం, పండరిభజన, పిల్లనగ్రోవి, గరగలభజన తదితర కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు.
5 వేదికల్లో కార్యక్రమాలు
తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఎస్.వి.సంగీత కళాశాల ఆధ్వర్యంలో ఉదయం 5.30 నుండి 6 గంటల వరకు మంగళధ్వని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు వేద పారాయణం నిర్వహిస్తారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు ధార్మికోపన్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు హరికథ పారాయణం, సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు అన్నమయ్య విన్నపాలు, రాత్రి 6 నుండి 7 గంటల వరకు ఊంజల్ సేవ అన్నమయ్య సంకీర్తనల ఆలాపన ఉంటుంది.
అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు భక్తి సంగీతం లేదా వాయిద్య సంగీతం, నృత్యరూపకాలు ప్రదర్శిస్తారు. తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు జానపద నృత్యం లేదా జానపద సంగీతం లేదా హరికథ వినిపిస్తారు.
ప్రతిభ గల కళాకారులకు పెద్దపీట
ఈ బ్రహ్మోత్సవాల్లో కళాప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రతిభ గల కళాకారులకు టిటిడి పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం 15 నుండి 40 ఏళ్లలోపు గల కళాకారులు ప్రదర్శన వీడియోలు పంపాలని కోరింది. ఈ వీడియోలను నిపుణుల కమిటీ పరిశీలించి ప్రతిభ గల కళాకారులను ఎంపిక చేస్తుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.