JEO REVIEW ON AVILALA WORKS_ అవిలాల చెరువులో అభివృద్ధి పనుల తనిఖీ
Tirupati, 20 Jun. 19: TTD Joint Executive Officer Sri B Lakshmi Kantham today directed officials to complete all ongoing works of Sri Venkateswara Spiritual theme park in the Avilala tank on a war footing.
The JEO who inspected the works on Thursday evening asked officials to take up on priority in the first phase like internal fencing of compound wall, approach road from high way, ticket counters, parking area for cars, scooters and buses, service road, cycle track, walking track etc.
He also wanted completion of works for devotees like drinking water, food courts and toilets on a war footing.
TTD SE-1 Sri M Ramesh Reddy, DE Sri Ravi Shankar Reddy and others participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అవిలాల చెరువులో అభివృద్ధి పనుల తనిఖీ
తిరుపతి, 2019 జూన్ 20: తిరుపతిలోని అవిలాల చెరువులో చేపడుతున్న అభివృద్ధి పనులను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం గురువారం సాయంత్రం తనిఖీ చేశారు.
వేంకటేశ్వర ఆధ్యాత్మిక వైభవ ఉద్యానవనం(స్పిరిచువల్ థీమ్ పార్క్) పనులను జెఈవో పరిశీలించారు. మొదటి దశలో ఇంటర్నల్ ఫెన్సింగ్ వెలుపల ప్రహరీ, హైవే నుండి రోడ్డు, టికెట్ కౌంటర్లు, ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులు నిలిపి ఉంచేందుకు వీలుగా పార్కింగ్ ప్రదేశం, సర్వీస్ రోడ్, సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు పనులు చేపట్టాలని జెఈవో అధికారులను ఆదేశించారు. సందర్శకుల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, ఫుడ్‌కోర్టులు ఏర్పాటుచేయాలన్నారు.
జెఈవో వెంట టిటిడి ఎస్ఇ-1 శ్రీ ఎం.రమేష్ రెడ్డి, డిఇ శ్రీ రవిశంకర్‌రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.