AVULAPALLE TEMPLE MERGED IN TTD _ టిటిడి ఆధీనంలోకి ఆవుల‌ప‌ల్లె శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి ఆల‌యం

Tirupati, 12 Dec. 20: Sri Prasanna Venkateswara temple at Avulapalle in Somala Mandal of Chittoor district was ceremoniously merged with TTD on Saturday in the presence of AP minister Sri Peddireddy Ramachandra Reddy.

The Sri Chandramouli, Assistant   Commissioner of the Endowments department handed over the temple documents to TTD DyEO Smt Shanti.

The temple has been merged with Sri Kalyana Venkateswara Swamy group of temples of TTD.

Chittoor MP Sri Reddappa, TTD AEO Sri Dhananjeyulu, Superintendents Sri Chengalrayalu, Sri Nagaraj and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఆధీనంలోకి ఆవుల‌ప‌ల్లె శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి ఆల‌యం

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 12: చిత్తూరు జిల్లా సోమ‌ల‌ మండ‌లం ఆవుల‌ప‌ల్లె‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం శ‌ని‌‌వారం జ‌రిగింది. రాష్ట్ర ‌మంత్రివ‌ర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మ‌క్షంలో ఈ విలీన కార్య‌క్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

అనంత‌రం దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శ్రీ చంద్ర‌మౌళి ఆల‌యానికి సంబంధించిన రికార్డులు, ఇత‌ర ప‌త్రాల‌ను టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతికి అంద‌జేశారు. శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌‌‌స్వామివారి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్తూరు పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ రెడ్డ‌ప్ప‌, టిటిడి ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూప‌రింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయ‌లు,  శ్రీ న‌ట‌రాజు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.