AWARENESS CAMP IN YOGA AND HEALTHY DIET TO EMPLOYEES ON JUNE 21- JEO_ జూన్‌ 21న మహతి కళాక్షేత్రంలో ఉద్యోగుల హెల్త్‌ రిపోర్టు, చికిత్సలపై అవగాహన సదస్సు: తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

Tirupati, 19 Jun. 19: JEO Sri B Lakshmikantham said that there would be an awareness session on Yoga and Healthy Dietary to TTD employees on June 21.

In connection with World Yoga Day on June 21 TTD will be organizing this special programme at Mahati Auditorium in Tirupati between 3pm and 5pm, he added.

A review meeting in this connection was held at the Bungalow of JEO in Tirupati on Wednesday evening. He said 1345 employees and their kin underwent free health check-ups during Mega Medical Camp held at Central Hospital organised in Tirupati on June 1 and 2. “Now this special awareness programme will be of great use to them”, he maintained.

CE Sri Chandrasekhar Reddy, GM Sri Sesha Reddy, CMO Dr Nageswara Rao were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 21న మహతి కళాక్షేత్రంలో ఉద్యోగుల హెల్త్‌ రిపోర్టు, చికిత్సలపై అవగాహన సదస్సు: తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

తిరుపతి, 2019 జూన్ 19: తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జూన్ 21వ తేదీ శుక్ర‌వారం ఉద్యోగుల హెల్త్‌ రిపోర్టు, చికిత్సలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని జెఈవో బంగ్లాలో బుధ‌వారం సాయంత్రం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ జూన్ 1 మ‌రియు 2వ తేదీల‌లో 1345 మంది ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, విశ్రాంత ఉద్యోగులకు కేంద్రీయ వైద్యశాల, అశ్విని వైద్యశాల, ఎస్వీ ఆయుర్వేద వైద్యశాల, స్విమ్స్‌, బిల్రోత్‌, ఎంఎస్‌డి, ఎస్‌ఆర్‌ ఎల్‌ ఆస్పత్రుల స‌హాకారంతో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వైద్య శిబిరంలో బ్లడ్‌షుగర్‌, బిపి, అల్ట్రాసౌండ్‌, షుగర్‌ వ్యాధులు, స్త్రీల సంబంధిత వ్యాధులు, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి పరీక్షలు, తదితర వైద్యసేవలు అందించిన్నట్లు తెలిపారు.

జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సంద‌ర్భంగా మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో మ‌ధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంట‌ల వ‌ర‌కు టిటిడి ఉద్యోగుల‌కు యోగా, వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ యోగ నిపుణులు శ్రీ వాసుదేవ‌రెడ్డి, సమతుల్య ఆహారంపై శ్రీ సాగ‌ర్ ఉద్యోగుల‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందిస్తారు. కావున ఈ అవ‌కాశాన్ని టిటిడి ఉద్యోగులు వారి కుటుంబ‌స‌భ్యులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జెఈవో కోరారు.

ఈ స‌మావేశంలో టిటిడి సిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, సిఎమ్‌వో డా|| నాగేశ్వరరావు, ర‌వాణా విభాగం అధికారి శ్రీ శేషారెడ్డి, అన్న‌ప్ర‌సాదం ప్ర‌త్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్‌, టిటిడి ఉద్యోగుల ప్ర‌తినిధులు, ఇత‌ర అధికారులుపాల్గోన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల