AWARENESS CAMPAIGN ON FIRE ACCIDENTS HELD FOR SHOPKEEPERS AT TIRUMALA _ అగ్నిప్రమాదాల నివారణపై దుకాణదారులకు అవగాహన
Tirumala, 04 September 2022: The TTD vigilance department organised an awareness campaign for Tirumala shopkeepers on fire accidents on Sunday.
The vigilance and Fire service officials demonstrated at the Sri Venkateswara high school grounds on likely accidents from negligent use of gas cylinders and precautionary measures needed to overcome the accidents if occurs.
They also issued advisories for keeping ready to use fire service equipments in shops, hotels etc.
Tirumala VGO Sri Bali Reddy, AVSOs Sri Sai Giridhar, Sri Shivaiah, VIs Sri Ramana Reddy, Sri Damodar, Fire service staff Sri Rajaiah, Shopkeepers and hoteliers were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అగ్నిప్రమాదాల నివారణపై దుకాణదారులకు అవగాహన
తిరుమల, 2022 సెప్టెంబరు 04: టిటిడి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం తిరుమలలోని దుకాణాల నిర్వాహకులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు.
శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల మైదానంలో గ్యాస్ సిలిండర్ల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఆ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలను టిటిడి విజిలెన్స్ అధికారులతోపాటు ఫైర్ సిబ్బంది తెలియజేశారు. అన్ని దుకాణాలు, హోటళ్లలో అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఎవిఎస్వోలు శ్రీ సాయి గిరిధర్, శ్రీ శివయ్య, విఐలు శ్రీ రమణారెడ్డి, శ్రీ దామోదర్, ఫైర్ సిబ్బంది శ్రీ రాజయ్య, దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.