AYODHYA KANDA AKHANDA PARAYANAM THRILLS DEVOTEES IN DEVOTION _ శ్రీ రామనామ స్మరణతో పులకించిన సప్తగిరులు

Tirumala, 10 March 2024: The 8th edition of Ayodhya Kanda Akhanda Parayanam held on Sunday morning at the Nadaneerajanam stage in Tirumala, and SVBC telecaASst the program live from 7 am to 9 am for the sake of global devotees.

A total of 156 slokas were recited from the 26th to 30th sargas of Ayodhya Kanda, besides 25 slokas from Yogavasishtam and Dhanvantari Mahamantra, taking the total to 181 slokas.

Dharmagiri Veda Vignana Peetham scholars Dr.  K. Ramanujacharya, Sri Ananta Gopalakrishna, Dr Maruti recited the shlokas repeated by the devotees.

Faculty and students of Dharmagiri, SV Vedic University, National Sanskrit University, SV Higher Vedic studies participated in Akhanda Parayanam.

On this occasion, the artists of the Annamacharya project Sri Srinivas and the troupe sang “Vandanamu Raghunandana Setu Bandhana Bhakta Chandana Rama…” at the beginning of the program and the bhajan “Rama Rama Ana Rade…” at the end in a mellifluous manner.

TTD officials, scholars and a large number of devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ రామనామ స్మరణతో పులకించిన సప్తగిరులు

– భక్తిసాగరంలో ముంచెత్తిన అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 10 మార్చి 2024: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉదయం జరిగిన 8వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

అయోధ్యకాండలోని 26 నుండి 30వ‌ సర్గ వ‌ర‌కు మొత్తం ఐదు స‌ర్గ‌ల్లో 156 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 181 శ్లోకాల‌ను పారాయణం చేశారు.

ధర్మగిరి వేద పాఠశాల పండితులు డా. కె.రామానుజాచార్యులు, శ్రీ అనంత గోపాలకృష్ణ, డా. మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు. అఖండ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణదారులు, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నా‌రు.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ శ్రీనివాస్ బృందం ” వందనము రఘునందన సేతు బంధన భక్త చందన రామ…. ” అనే కీర్తనను కార్యక్రమ ప్రారంభంలో, “రామ రామ అన రాదే ……” అనే భజనను చివరిలో రసరమ్యంగా ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ అధికారులు, పండితులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.