AYODHYAKANDA AKHANDA PARAYANAM ON OCTOBER 9 _ అక్టోబ‌రు 9న 4వ విడ‌త‌ అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 07 October 2023:  The fourth edition of Ayodhya Kanda Akhanda Parayanam will be observed in the Nada Neerajanam platform at Tirumala on October 9 between 7 a.m. and 9 a.m.
 
The program will be telecasted live on SVBC for the sake of global pilgrims.
 
As a part of the fete Vedic Scholars and Veda parayanamdars will recite 142 slokas from two chapters 12 and 13 of Ayodhyakanda besides 25 slokas from Yoga Vasistyam and Dhanvantari Mahamantram.
 
A total of 167 slokas will be recited on the occasion.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబ‌రు 9న 4వ విడ‌త‌ అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2023 అక్టోబ‌రు 07: లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై అక్టోబ‌రు 9వ తేదీన‌ 4వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 7 నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

అయోధ్యకాండలోని 12, 13వ‌ సర్గలలోని 142 శ్లోకాలు, యోగ‌వాశిష్టం మ‌రియు ధ‌న్వంత‌రి మ‌హామంత్రంలోని 25 శ్లోకాలు క‌లిపి మొత్తం 167 శ్లోకాల‌ను పారాయణం చేస్తారు. ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తులు ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.