AYUDHA PUJA HELD _ టీటీడీ ముద్రణాలయంలో ఘనంగా ఆయుధపూజ

TIRUPATI, 22 OCTOBER 2022: Ayudha Puja was held at TTD Printing Press on Saturday in Tirupati.

TTD EO Sri AV Dharma Reddy took part in the Puja performed to the printing, DTP, offset, Binding machineries on the occasion.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, DLO Sri Reddeppa Reddy, GM Transport Sri Sesha Reddy, PRO Dr T Ravi, Special Officer Printing Press Sri Ramaraju and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ముద్రణాలయంలో ఘనంగా ఆయుధపూజ

తిరుపతి, 2022 అక్టోబరు 22: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా గల టీటీడీ ముద్రణాలయంలో శ‌నివారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా శ్రీవారి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముద్రణాలయాన్ని అందంగా అలంకరించి అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ గల డిటిపి, ఆఫ్‌సెట్‌, మిష‌న్ సెక్ష‌న్‌, ఆర్టిస్టు, బైండింగ్‌ విభాగాల్లోని యంత్రాలకు పూజ చేశారు.

జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, డిఎల్‌వో శ్రీ రెడ్డ‌ప్ప‌రెడ్డి, పిఆర్‌వో డా|| టి.రవి, ముద్రణాలయం ప్ర‌త్యేకాధికారి శ్రీ రామ‌రాజు, ర‌వాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి, డిఈవో శ్రీ భాస్క‌ర్ రెడ్డి, పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.