AYUDHA PUJA IN TTD TRANSPORT DEPOT _ టిటిడి రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ

Tirupati, 24 Oct. 19: The Ayudha Puja was observed in TTD Transport Depot at Tirupati on Thursday. 

TTD Trust Board Chief Sri YV Subba Reddy who took part in this event said, there are about 300vehicles in TTD which includes buses,  trucks,  lorries, jeeps,  cars etc. Nearly 500 staffs are exclusively working in TTD Transport including the drivers. The TTD Transport has a historical incident free track record in ghat roads and the chairman lauded the efforts of drivers.

With an aim to protect the environs in Tirumala, we will soon introduce electric buses,  he added. 

TUD Chairman and Ex Office TTD Board Sri Chavireddy Bhaskar Reddy, Transport GM Sri Sesha Reddy,  Addl CVSO Sri Sivakumar Reddy, office staffs, DIs,  drivers and others were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

టిటిడి రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ

అక్టోబర్‌ 24, తిరుపతి, 2019: తిరుపతిలోని టిటిడి రవాణా విభాగంలో గురువారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిటిడి ఛైర్మెన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా టిటిడి చైర్మెన్‌ మాట్లాడుతూ దసరా, దీపావళి పర్వదినాల మధ్యలో టిటిడిలో ముఖ్యమైన రవాణా విభాగంలో ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులకు విశేష సేవలు అందిస్తున్న టిటిడి రవాణా విభాగం అధికారులు, సిబ్బంది, డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుమలలో 12 ధర్మరథాలు రోజుకు 300 ట్రిప్పలతో దాదాపు 70 వేల మంది భక్తులను వివిధ ప్రాంతాలకు ఉచితంగా చేరవేస్తున్నాయన్నారు. టిటిడిలో 300 వాహనాలు, 500 మంది కార్మికులు భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలియజేశారు. ఆయా విభాగాలు భక్తులకు మెరుగైన సేవలు అందించడం వెనక రవాణా విభాగం పాత్ర కీలకమన్నారు. టిటిడిలో పర్యావరణాన్ని కాపాడేందుకు ముందుగా తిరుమలలో ధర్మరథాల స్థానంలో ఎలక్ట్రికల్‌ బస్సులను వినియోగించేందుకు చర్యలు చేపట్టామన్నారు.  తదుపరి టిటిడి ఉద్యోగస్తులు వినియోగిస్తున్న వాహనాల స్థానంలో ఎలక్ట్రికల్‌ వాహనాలు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిత్యం వందలాది వాహనాలను నడుపుతున్న ఈ విభాగానికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. జిఎం, సూపర్‌వైజర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు ఇతర సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.

అంతకుముందు రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో టిటిడి ఛైర్మెన్‌ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, తుడా ఛైర్మెన్‌ మరియు టిటిడి ఎక్స్‌ అఫిషియో సభ్యులు  డా. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిలు శ్రీవారి విగ్రహానికి, సంచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని వివిధ టిటిడి వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు.

కాగా, 1948వ సంవత్సరంలో రెండు వాహనాలతో టిటిడి రవాణా విభాగం ప్రారంభమైంది. అంచెలంచలుగా ఎదిగి 1975లో భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఎపిఎస్‌ఆర్‌టిసికి టిటిడి బస్సులను అప్పగించారు. ప్రస్తుతం దాదాపు 300 వాహనాలు గల ఈ శాఖ ఇటు తిరుమల, అటు తిరుపతిలో శ్రీవారి భక్తులకు, ఉద్యోగులకు విశేషసేవలు అందిస్తూ స్వామివారి భక్తి వైభవవ్యాప్తికి క షి చేస్తోంది. తిరుపతిలోనడక దారి భక్తులకు 3 ధర్మరథాలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుండి అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గం వరకు విశేష సేవలందిస్తున్నాయి. 12 అంబులెన్స్‌లు, రెండు ఘాట్‌ రోడ్లలో ఆటోక్లినిక్‌ వాహనాలు, క్రేన్‌లు తక్కువ ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తున్నాయి. తిరుమలలో బ్యాటరీ కార్లు వ ద్ధులకు, వికలాంగులకు ఉపయోగకరంగా ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీశివకుమార్‌రెడ్డి, రవాణా విభాగం ఏఈవో శ్రీ ఏ. రాజశేఖర్‌ బాబు, ఏఎమ్‌ఎఫ్‌ శ్రీమతి లక్ష్మీప్రసూన, డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్లు శ్రీ రాధాకృష్ణ,       శ్రీ సుబ్రమణ్యం, స్టోర్‌ కీపర్‌ శ్రీ ఈశ్వర్‌ రెడ్డి, డ్రైవర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.