AYUDHA PUJA PERFORMED _ తిరుమల రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ
Tirumala, 25 Oct. 19: TTD Additional EO Sri AV Dharma Reddy took part in Ayudha Puja at Tirumala on Friday evening.
Speaking on this occasion the Additional EO said, every year Ayudha Puja will be observed after Brahmotsavams to seek the blessings of Almighty for an incident free safe travels in the ghat section. He also lauded the services of drivers of TTD Transport.
GM Sesha Reddy, DyEOs Sri Harindranath, Sri Damodar, HO Dr R R Reddy, DI Sri Mohan and others were also present.
Earlier Ayudha Puja was also performed by TTD Forest Department in Tirumala.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుమల రవాణా విభాగంలో ఘనంగా ఆయుధపూజ
తిరుమల, 2019 అక్టోబరు 25 : తిరుమలలోని రవాణా విభాగం వర్క్‌షాపులో శుక్రవారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ ఘాట్ రోడ్డులో సురక్షిత ప్రయాణం కోసం ప్రతి సంవత్సరం దసరా అనంతరం, దీపావళి ముందు ఆయుధపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా రవాణా సిబ్బంది సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, రవాణ విభాగం జనరల్ మేనేజర్ శ్రీ శేషారెడ్డి కలిసి శ్రీవేంకటేశ్వరస్వామివారి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అదే విధంగా టిటిడి వాహనాలను అలంకరించి పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇఓలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ దామోదరం, ఆరోగ్య శాఖాధికారి డా. ఆర్ఆర్.రెడ్డి, డిఐ శ్రీ మోహన్, డ్రైవర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు తిరుమలలో అటవీ విభాగం ఆధ్వర్యంలో ఆయుధపూజ జరిగింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.