AYURVEDA CAMP GETS HUGE RECEPTION _ ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పంద‌న‌

Tirupati, 26 Mar. 22: Ayurveda Camp set up by SV Ayurvedic College and Hospital in Ramachandrapuram Mandal in Kuppam Badur village received huge response from locals on Saturday.

 

Tests were conducted and free Ayurvedic medicines were distributed to the patients. Awareness camp was also conducted to students of High School in the village.

 

Dr Sunila explained some cautions to be followed during Menstrual cycle to girls of 8,9,10 classes.

 

Ayurvedic College Principal Dr Muralikrishna, doctors Dr Sundaram, Dr Gnana Prasanna, Dr Nagamani, PG students and para medical staff were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పంద‌న‌

తిరుపతి, 2022 మార్చి 26: ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల, వైద్య‌శాల ఆధ్వ‌ర్యంలో రామ‌చంద్రాపురం మండ‌లం కుప్పం బాదురు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత‌ ఆయుర్వేద వైద్య శిబిరం మ‌రియు ఆయుర్వేదంలో చెప్ప‌బ‌డిన‌ ఆరోగ్య నియ‌మాల‌ అవగాహన కార్యక్రమానికి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది.

ఈ ఆయుర్వేద వైద్య శిబిరంలో గ్రామస్తులకు రక్త, వైద్య పరీక్షలు నిర్వ‌హించి, వా
వ్యాధుల‌ను నిర్ధారించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామంలోని ఉన్న‌త పాఠశాల విద్యార్థులకు ఆయుర్వేదం లో చెప్పబడిన ఆహారం, ఆరోగ్య నియ‌మాల‌ను తెలియజేశారు.

అనంత‌రం 8, 9, 10వ తరగతి బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రుతుస్రావం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ సునీల వివరించారు.

ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, అధ్యాపకులు డా.సుందరం డా.జ్ఞాన ప్రసన్న డా.నాగమణి, పీజీ విద్యార్థులు, పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.