AYURVEDA HAS GOT WIRLD ACCLAIM-JEO(H&E) _ ఆయుర్వేద వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ – కోర్సును ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు _టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి 

TIRUPATI, 20 FEBRUARY 2023: In the aftermath of the Covid Pandemic, Ayurvedic medicine has got world recognition and the students who are pursuing this ancient science should focus on a serious note for a bright future ahead, said TTD JEO (H&E) Smt Sada Bhargavi.

On the inaugural session of the 15-day training class to new batch students for the academic year 2022-23 she said the students should not think of Ayurveda as a left over option since they have not procured a seat in MBBS.

There are many who are pursuing Ayurveda leaving MBBS and complimented Dr Renu Dixit for taking forward the Ayurvedic Hospital in an effective manner.

Principal Dr Muralikrisha, Vice Principal Dr Sundaram, faculty and students were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆయుర్వేద వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ – కోర్సును ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు _టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 20 ఫిబ్రవరి 2023: కోవిడ్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఆయుర్వేద వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి చెప్పారు. విద్యార్థులు ఆయుర్వేద వైద్యాన్ని ఇష్టపడి చదివి లోతైన పరిజ్ఞానం సంపాదిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల 2022-23 బ్యాచ్ నూతన విద్యార్థులకు 15 రోజుల శిక్షణా కార్యక్రమం కళాశాలలో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జేఈవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ,
శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంత విద్యనభ్యసించడం విద్యార్హుల పూర్వజన్మ సుకృత మన్నారు. ఎంబిబిఎస్ సీటు రానందువల్ల ఆయుర్వేద వైద్యంలో చేరామనే అభిప్రాయం ఉంటే వెంటనే వదిలేయాలన్నారు. ఎంబిబిఎస్ సీటు వదులుకుని ఆయుర్వేద వైద్య కోర్సులో చేరుతున్న వారు చాలామంది ఉన్నారని ఆమె తెలిపారు. భారతీయ సనాతన వేదాలతో మిళితమై ఉన్న ఆయుర్వేద వైద్యాన్ని ప్రపంచమంతా ఆదరిస్తోందన్నారు. కోవిడ్ సోకిన వారు, కోవిడ్ సోకకుండా ముందు జాగ్రత్తలు పాటించిన వారు ఆయుర్వేద కషాయాలు, మందులు వాడిన విషయం అందరికీ తెలుసునన్నారు. భారతీయుల వంటిల్లే పెద్ద వైద్యాలయమని ఆమె చెప్పారు. సామాజిక, వాతావరణ మార్పుల వల్ల జనానికి అనేక జబ్బులు వస్తున్నాయని, వీటిని పూర్తిగా నయం చేయడం, రాకుండా చేయగలిగే శక్తి ఆయుర్వేదానికి ఉందని జేఈవో వివరించారు. ఆయుర్వేద వైద్యం సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకుని దాన్ని జనంలోకి తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు.

టీటీడీ ఆయుర్వేద కళాశాలకు 40 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. కళాశాలలో సెమినార్ హాల్ నుంచి అవసరమైన అన్ని వసతులు అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయస్థాయి సెమినార్లు,వర్క్ షాప్ లు నిర్వహిస్తామన్నారు. 15 రోజుల శిక్షణా కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయుర్వేద కళాశాలను ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, ఆయుర్వేద ఆసుపత్రిని సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ చక్కగా నిర్వహిస్తున్నారని జేఈవో అభినందించారు.

ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ కళాశాల ప్రగతి, ఇక్కడి విద్యార్థులు సాధించిన విజయాలు, అందుకున్న ఉన్నత స్థానాల గురించి వివరించారు.

ఆసుపత్రి అభివృద్ధి, నిర్వహణ పై సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు.

కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం తో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది