JEO INSPECTS SV SCHOOL FOR DEAF AND SV AYURVEDIC HOSPITAL_ ఎస్వీ బదిర పాఠశాల, ఆయుర్వేద ఆసుపత్రిలో జెఈవో తనిఖీలు
Tirupati, 16 Mar. 19: TTD Joint Executive Officer, Sri B Lakshmikantham today inspected various TTD institutions and directed officials to take up repairs and welfare measures for benefit of students and devotee patients.
After inspecting the SV Deaf and Dumb school the JEO said steps were taken to provide good food and protected drinking water to inmates and directed officials to immediately take up repair works and resolve staff shortfalls .He also inspected the handicapped students trying centre where challenged students were trained as fitters and turners a d directed officials to provide sleeping cots. Developmental works of ₹1.1 crore were taken up at the Sri Govindaraja swami hostel.
After inspection of the SV Ayurveda hospital the JEO said an additional out patient ward was being proposed to meet the popular demand of patients. He also urged officials to ensure hygiene and cleanliness in the hospital.
At the TTD call centre he said devotees were given correct information on a 24×7 basis on time slots available for sarva darshan, Divya darshan etc. The devotees were advised to give suggestions and grievances, through email, call centres or through Whatapp numbers.
TTD SE-1 Sri Ramesh Reddy, CMO Dr Nageswar Rao, DyEO Smt Bharati and additional health officer Sri Sunil Kumar and officials of concerned departments participated.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఎస్వీ బదిర పాఠశాల, ఆయుర్వేద ఆసుపత్రిలో జెఈవో తనిఖీలు
తిరుపతి, 2019 మార్చి 16: టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం శనివారం తిరుపతిలోని ఎస్వీ బదిర పాఠశాల, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి, వికలాంగుల శిక్షణ కేంద్రం, టిటిడి కాల్ సెంటర్‌ను పరిశీలించారు. అక్కడి వసతులను పరిశీలించి మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఎస్వీ బదిర పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుకుంటున్నారని, ప్రశ్నిస్తే చక్కగా స్పందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, రక్షిత తాగునీరు అందిస్తున్నామన్నారు. మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరుస్తామని చెప్పారు. అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించామన్నారు. సిబ్బంది కొరతపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వికలాంగుల శిక్షణ కేంద్రంలోని ఫిట్టర్, టర్నర్ తదితర విభాగాల్లో విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. వికలాంగ విద్యార్థుల కోసం అనువుగా మంచాలు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీ గోవిందరాజస్వామి హాస్టల్ భవనంలో రూ.1.1 కోట్లతో అభివృద్ధి, మరమ్మతు పనులు చేయనున్నట్టు తెలిపారు.
ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రికి వైద్యం కోసం ఎక్కువమంది వస్తున్నారని, అదనపు ఓపి బ్లాక్ కోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని జెఈవో వెల్లడించారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగుల కోసం రెండు వార్డుల్లో ఎసి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆసుపత్రిలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. టిటిడి కాల్‌సెంటర్ ద్వారా 24 గంటల పాటు భక్తులకు కచ్చితమైన సమాచారం అందిస్తున్నామని తెలిపారు. భక్తుల సలహాలు, సూచనలను వెంటనే ఆయా విభాగాలకు తెలియజేసి సత్వరం పరిష్కార చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి టైంస్లాట్ సర్వదర్శనం, దివ్యదర్శనం తదితర టికెట్ల సమాచారాన్ని భక్తులకు తెలియజేసేలా కాల్ సెంటర్‌లో తగిన ఏర్పాట్లు చేపడతామన్నారు. కాల్ సెంటర్, వాట్స్ యాప్, ఈ-మెయిల్ ద్వారా భక్తులు తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులను టిటిడికి తెలియజేవచ్చని తెలిపారు.
జెఈవో వెంట టిటిడి ఎస్ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ముఖ్య వైద్యాధికారి డా.. నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవో శ్రీమతి భారతి, అదనపు ఆరోగ్యశాఖాధికారి డా.. సునీల్‌కుమార్ ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.